కోహ్లీ కుర్రాడు...అందువల్లే ఆ దూకుడు: బాలీవుడ్ డైరెక్టర్ సపోర్ట్

By Arun Kumar PFirst Published Nov 10, 2018, 8:56 PM IST
Highlights

ఓ అభిమాని ట్వీట్ పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లతో పాటు పలువరు ప్రముఖులు కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక నెటిజన్లు వివిధ పద్దతుల్లో కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ వివరణ ఇచ్చినప్పటికి ఆ వ్యాక్యలపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. 

ఓ అభిమాని ట్వీట్ పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లతో పాటు పలువరు ప్రముఖులు కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక నెటిజన్లు వివిధ పద్దతుల్లో కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ వివరణ ఇచ్చినప్పటికి ఆ వ్యాక్యలపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. 

తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా చాలా గమ్మత్తుగా స్పందించారు. కోహ్లీని సపోర్ట్ చేస్తూనే ఆయన వ్యాఖ్యలపై సున్నిత విమర్శలు చేశారు. కోహ్లీ ఇంకా కుర్రవాడే కాబట్టి కాస్త దుందుడుకుగా ప్రవర్తిస్తున్నాడని అనుభవ్ అన్నాడు. కానీ అభిమానిని ''దేశం విడిచి వెళ్లిపో'' అన్నందునే అతడిపై ఓ అభిప్రాయానికి రావద్దంటూ అభిమానులకు సూచించాడు. 

కోహ్లీ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని... అవి మరీ అంత తప్పుబట్టాల్సిన వ్యాఖ్యలు కావని అనుభవ్ పేర్కొన్నాడు. అయినా ప్రజలను దేశం నుండి వెళ్లగొట్టడం ఇప్పుడంత సాధారనమేమీ కాదంటూ అనుభవ్ ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఈ వివాదానికి కారణమైన అభిమాని ట్వీట్ ఇలా ఉంది.  ‘‘ నా దృష్టిలో మీరు అంత గొప్ప బ్యాట్స్‌మెన్ ఏం కాదు.... మీ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను..''  అంటూ సదరు అభిమాని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన విరాట్.. '' అలా అయితే నువ్వు భారతదేశంలో ఉండటం అనవసరం.. ఈ దేశంలో ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చు కదా.. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు.. కానీ నువ్వు మాత్రం భారత్‌లో ఉండకూడదు అనేది నా అభిప్రాయం..'' అంటూ ఘాటుగా బదులిచ్చాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలే దుమారానికి కారణమయ్యాయి. 

మరిన్ని వార్తలు

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

కోహ్లీ అన్నదాంట్లో తప్పేముంది..? మద్దతుగా నిలిచిన కైఫ్  

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

 

click me!