ఆ విషయంలో ధోనిని సమం చేసిన పంత్

By ramya NFirst Published Mar 8, 2019, 1:18 PM IST
Highlights

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని.. యువ క్రికెటర్ రిషబ్ పంత్ సమం చేశాడు. రికార్డుల్లో కాదులేండి.. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..
 

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని.. యువ క్రికెటర్ రిషబ్ పంత్ సమం చేశాడు. రికార్డుల్లో కాదులేండి.. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..

తన అద్భుతమైన ప్రదర్శనతో రిషబ్ పంత్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రకటించిన సెంట్రల్ కంట్రాక్ట్‌లో ‘ఎ’ గ్రేడ్ దక్కించుకున్నాడు. అక్టోబరు 1, 2018 నుంచి సెప్టెంబరు 30, 2019 వరకూ కొత్త వార్షిక కాంట్రాక్ట్‌ను బీసీసీఐ విడుదల చేయగా.. అందులో రూ. 5 కోట్లు విలువైన కాంట్రాక్ట్‌లో రిషబ్ పంత్‌కి చోటు లభించింది. 

బీసీసీఐ ఎ+, ఎ, బి, సి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లను ఆటగాళ్లకి ఇస్తోంది. ఇందులో వన్డే, టీ20, టెస్టుల్లో (మూడు ఫార్మాట్లలో) రెగ్యులర్‌గా ఆడుతున్న క్రికెటర్లకి మాత్రమే ఎ+ గ్రేడ్ కేటాయించింది. ఈ జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండగా.. వీరికి రూ. 7 కోట్లు ఏడాది కాంట్రాక్ట్‌ కింద లభించనున్నాయి. గత ఏడాది ఈ గ్రేడ్‌లో ఉన్న శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈసారి ‘ఎ’ గ్రేడ్‌కి పడిపోయారు. 

కాగా.. మిస్టర్ కూల్ ధోని కూడా ఏ కేటగిరీలోనే చోటు దక్కించుకున్నాడు. అంటే,.. ధోని తో సమానంగా పంత్ కాంట్రాక్ట్ దక్కించుకన్నట్లేగా. కేరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పంత్ ఈ ఘనత దక్కించుకోవడం విశేషం.

click me!