ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్‌ సంచలనం.. నెంబర్‌వన్‌ను ఓడించి స్వర్ణం

First Published Jul 23, 2018, 10:59 AM IST
Highlights

ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో భారత యువ సంచనలం లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.  ఏకంగా ప్రపంచ నెంబర్‌వన్‌ను మట్టికరిపించి దేశానికి స్వర్ణం సాధించాడు

ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో భారత యువ సంచనలం లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.  ఏకంగా ప్రపంచ నెంబర్‌వన్‌ను మట్టికరిపించి దేశానికి స్వర్ణం సాధించాడు.. ఆదివారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో మ్యాచ్‌లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవత్ వితిద్ శరణ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించి ఆసియా ట్రోఫీ అందుకున్నాడు. తద్వారా ఈ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన మూడో భారత షట్లర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇంతకు ముందు దివంగత గౌతమ్ టక్కర్, పీవీ సింధులు భారత్ తరపున ఈ ఘనత సాధించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్యసేన్ 2016లో ఈ టోర్నీలో కాంస్య పతకం సాధించాడు.. ఈ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి లక్ష్యసేన్ అన్నీ సంచనాలే నమోదు చేశాడు.

ఫైనల్ ముగిసిన అనంతరం సేన్ మాట్లాడుతూ... ‘‘ ఈ టోర్నీలో తీరిక లేకుండా ఆడాను.. వాస్తవంగా కాలి గాయంతో ఛాంపియన్‌షిప్‌కు ముందు ట్రైనింగ్ సరిగా తీసుకోలేదు.. విపరీతంగా పెయిన్‌కిల్లర్స్‌ను వాడాను.. టాప్ ఆటగాళ్లందరినీ గతంలో ఎదుర్కొని ఉండటంతో నాకు వారి ఆటపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని.. అది ఈ టోర్నీలో బాగా ఉపయోగపడిందని సేన్’’ అన్నాడు. 

click me!