ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రొఫెషనల్ క్రికెట్ కి వీడ్కోలు తెలిపారు.
ఇంగ్లాండ్ : ప్రొఫెషనల్ క్రికెట్ కి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ వీడ్కోలు చెప్పారు. 38 ఏళ్ల అలిస్టర్ కుక్ 2018లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కౌంటిల్లో ఎస్ఎక్స్ కు ఆడుతున్నారు. ‘ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ నా జీవితంలో భాగమైపోయింది. క్రికెట్ కె గుడ్ బై చెప్పడం అంత సులభం కాదు’ అంటూ పేర్కొన్నారు. 12,472 టెస్ట్ రన్స్ తో ఇంగ్లాండు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అలిస్టర్ కుక్ రికార్డు నెలకొల్పాడు.