వినాయక చవితి పూజ.. ఏ సమయానికి చేయాలి..?

By telugu news teamFirst Published Sep 9, 2021, 2:34 PM IST
Highlights

చవితి తిథి ముందు రోజు రాత్రి  12:18 నిమిషాల నుండి సెప్టెంబరు 10 రాత్రి 09 :57  నిమిషాల వరకు ఉంటుంది. వినాయకుడిని చవితి తిథినాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి ఇంట కష్టాలనేవే రావని విశేషంగా నమ్ముతారు.

 

                వక్రతుండ మహాకాయ
                కోటిసూర్య సమప్రభ
                నిర్విగ్నం కురుమేదేవా
                సర్వ కార్వేషు సర్వదా


వినాయకుడు అంటే అద్వితీయుడు, ఆనంద స్వరూపుడని అర్దం. సకల దేవతాగణములకు అదిపతి గణపతి. అటువంటి మహా శక్తి సంపన్నుడైనా ఆగణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడట. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. సకల కార్యలలో ప్రదమ పూజ్యుడు. ఏ పద్దతుల వారైనా ముందు గణపతినే పూజిస్తారు, ఏ గణానికైనా అతనే పతి అందుకే అతన్ని గణపతి అన్నారు. ఏ పనినైనా ప్రారంబించే ముందు ఆరదించే దేవుడు గణపతి. అందుకే ఆయన్ను ఆదిదేవుడని అంటారు. కీర్తని ప్రసాదించేవాడు, లాభాలను కలిగించువాడుకాబట్టి ఆయనను లక్మీగణపతిగా పిల్చుకుంటారు.

వినాయక చవితిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 10 శుక్రవారం రోజు వచ్చింది. చవితి తిథి ముందు రోజు రాత్రి  12:18 నిమిషాల నుండి సెప్టెంబరు 10 రాత్రి 09 :57  నిమిషాల వరకు ఉంటుంది. వినాయకుడిని చవితి తిథినాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి ఇంట కష్టాలనేవే రావని విశేషంగా నమ్ముతారు.
 
వినాయక చవితి ముహూర్తం:-

వర్జ్యం :- సాయంత్రం 6:12 నుండి 7:41 వరకు.  
రాహుకాలం :- ఉదయం 10:30 నుండి 12:00 వరకు.  
దుర్ముహూర్తం :- ఉదయం :- 8:25 నుండి 9:14 వరకు. 
యమగండం :- పగలు 3:00 నుండి 4:30 వరకు.  

అమృత ఘడియలు :- ఉదయం 6:59 నుండి 7:41 వరకు.  
బుధ హోరా:- ఉదయం 7:00 నుండి 8:00 వరకు.   
చవితి నాడు పూజ ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 01.33 గంటల మధ్య జరుపుకోవాలి. ఈ రోజు విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలుగుతాయని, అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారని భక్తులు విశ్వసిస్తారు.

* మట్టి వినాయకుడి పూజిస్తే శ్రేష్టం. ఈ పూజలు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా ఎవరి తాహతు బట్టి వారు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి నాడు గణేశుని సాగనంపుతూ ఉత్సవాన్ని జరుపుతారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


 

click me!