ఆ సమయంలో ముద్దు పెట్టుకోవద్దని, ఇరు ముఖాల్ని సైతం దగ్గరగా రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఏమాత్రం తగ్గని ఈ పరిస్థితిలో వీలైనన్నీ పరిమితులతో శృంగారంలో పాల్గొనడం మంచిదని సలహా ఇస్తున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే.. మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. అసలు ప్రస్తుతం మాస్క్ మన జీవితంలో ఒక భాగమైంది. మొన్నటి వరకు ఇంట్లో బయటకు వెళితే మాస్క్ పెట్టుకోవాలని నిపుణులు చెప్పారు. ఆ తర్వాత టాయ్ లెట్ లోనూ మాస్క్ తప్పదన్నారరు. ఇప్పుడు శృంగార సమయంలో.. పడకగదిలో పార్ట్ నర్ తో రొమాన్స్ చేసే సమయంలోనూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనట.
శృంగార సమయంలో కూడా మాస్క్ తప్పనిసరి అంటున్నారు కెనడాకు చెందిన ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టాం. అంతే కాదండోయ్.. ఆ సమయంలో ముద్దు పెట్టుకోవద్దని, ఇరు ముఖాల్ని సైతం దగ్గరగా రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఏమాత్రం తగ్గని ఈ పరిస్థితిలో వీలైనన్నీ పరిమితులతో శృంగారంలో పాల్గొనడం మంచిదని సలహా ఇస్తున్నారు.
కొత్త భాగస్వాములతో శృంగారం చాలా ప్రమాదనమని, అలాంటి సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ థెరెసా అంటున్నారు. ముఖ్యంగా ముద్దు వంటి సన్నిహిత సంబంధాలను దూరం పెట్టడమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తికి భౌతికదూరం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని, శృంగారంలో భౌతిక దూరానికి తావు లేకపోవడం వల్ల.. కనీసం మాస్కులైనా ధరించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు.