కార్డియాక్ అరెస్ట్ కి, హార్ట్ ఎటాక్ కి తేడా ఏంటి..?

First Published Feb 26, 2018, 3:02 PM IST
Highlights
  • మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది.
  • గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి.
  • అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయిన ప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కు కారణమవుతాయి.

అలనాటి అందాల తార శ్రీదేవి.. ఫిబ్రవరి 24వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘‘కార్డియాక్ అరెస్ట్’’ కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్.. ఈ రెండూ గుండెకి సంబంధించినవే అయినప్పటికీ.. రెండింటిలోనూ తేడా ఉంది.  అసలు కార్డియాక్ అరెస్ట్ కి, హార్ట్ ఎటాక్ ఉన్న తేడా అంటే..? వాటి లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

కార్డియాక్ అరెస్ట్ అంటే..

ఒక్కసారిగా గుండె రక్తసరఫరా ఆపేస్తుంది. మొదడుకి ఆక్సీజన్ అందదు. అప్పుడు మనిషి ఒక్కసారిగా కుప్పకూలి. ఊపిరాడక స్పృహ కోల్పోతాడు. దీనినే కార్డియాక్ అటాక్ అంటారు. కొందరు సెలబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయిన ప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కు కారణమవుతాయి.

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు..

కార్డియాక్ అరెస్ట్ వస్తే.. మనిషి ఒక్కసారిగా ఉన్నచోటనే కుప్పకూలిపోతాడు. దీనికి ముందు కొన్ని లక్షణాలు కూడా కనపడతాయి. చెస్ట్ లో కొద్ది నొప్పి రావడం, ఊపిరి  పీల్చుకోవడంలో ఇబ్బంది రావడం,నీరసంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం దీని లక్షణాలు అని చెబుతున్నారు నిపుణులు.

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ కి తేడా..

హార్ట్ ఎటాక్ విషయంలో.. గుండె కొట్టుకోవడం ఆగిపోదు. రక్తప్రసరణ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. గుండె పనితీరు కాస్త నెమ్మదిగా జరుగుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పటికీ బ్రతికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ.. కార్డియాక్ అరెస్ట్ విషయంలో.. గుండె నుంచి రక్త ప్రసరణ ఒక్కసారిగా ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం కూడా సడెన్ గా ఆగిపోతుంది. మెదడు సహా.. శరీరంలోని ఏ అవయవానికి రక్త ప్రసరణ జరగదు. మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలా పడిపోయిన  వెంటనే వైద్యం చేయకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంది. కార్డియాకర్ అరెస్ట్ వచ్చినవారిలో దాదాపు 90శాతం మంది మృత్యువాతపడ్డారని వైద్యులు చెబుతున్నారు.

click me!