రాజీవ్ చంద్రశేఖర్ కర్నాటక నుంచి రాజ్యసభ కు ఎన్నిక

First Published Mar 23, 2018, 9:59 PM IST
Highlights

కర్నాటకనుంచి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు ఎంపిక

బిజెపి అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కర్నాటక నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యారు. ఆయనకు స్పష్టమయిన మెజారీటి వచ్చింది. ఈ రోజు జరిగిన ఎన్నికలో ఆయనకు 50  వోట్లు పడ్డాయి. గెలవాలంటే 44 వోట్లుపడాలి ఆయనకు బిజెపికి ఉన్న మొత్తం వోట్లు పడ్డాయి.

 

ఈ  సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి, బిజెిపి అధ్యక్షుడు అమిత్ షాకు, కర్నాటక బిజెపి అధ్యక్షుడు యడ్యూరప్పకు కృతజ్ఞతలు చెప్పారు.

 

అదే విధంగా బిజెపి శాసన సభ్యులందరికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నుకుని బెంగుళూరు, కర్నాటకకు సేవచేసేందుకు అవకాశం కల్పించినందుకు ఆయన  బిజెపి నేతలందరికి ధన్యవాదాలు తెలిపారు.

 

తన విజయం కర్నాటకలో బిజెపి ప్రాబల్యం చెబుతుందని ఆయన అన్నారు. తాను బెంగుళూరు పట్టణాభివృద్ధికి రెండో దఫా సేవచేందుకు వీలుకలిగిందని రాజీవ్ చంద్రశేఖర్  చెప్పారు.

click me!