ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు గాడిద కూడా హాజరుకావచ్చా?

First Published Apr 29, 2018, 4:19 PM IST
Highlights

ఇందుకోసం హాల్ టికెట్ కూడా జారీ

నిరుద్యోగులే కాదు ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు గాడిదలు కూడా అప్లై చేయచ్చు.  అదీ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఉద్యోగాలకు. కానీ ఈ అవకాశం కేవలం కాశ్మీర్ సర్విసెస్ సెలక్షన్ బోర్డులో మాత్రమే. పరీక్ష రాయడానికి గాడిద పేరుతోనే హాల్ టికెట్లు కూడా ఇస్తారు. ఏంటి గాడిద పరీక్ష రాయడం ఏంటి...దానికి హాల్ టికెట్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ కింది స్టోరీని చదవాల్సిందే.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఖాళీగా వున్న తహశీల్దార్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసిన అభ్యర్థులకు హల్ టికెట్లు జారీ చేశారు. అయితే ఈ పరీక్షలో పరీక్ష రాయడానికి కచుర్ ఖర్ పేరుతో సర్వీసెస్ బోర్డు హాల్ టికెట్ జారీ చేసింది. హాల్ టికెట్ పై గాడిద బొమ్మ కూడా ఉంది. దీంతో ఈ హాల్ టికెట్ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం, దీనిపై జోకులు పేలడం మొదలైంది. కొందరు నెటిజన్లు ఈ వ్యవహారం తో సెలక్షన్ బోర్డు ఎంత బాగా పనిచేస్తుందో అర్థమవుతోందని చురకలు అంటిస్తున్నారు.

 
 

click me!