ఆశారాం బాపు దోషి

First Published Apr 25, 2018, 11:02 AM IST
Highlights

తేల్చి చెప్పిన జోధ్ పూర్ న్యాయస్థానం

తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఆశారాం బాపును జోధ్ పూర్ న్యాయస్థానం ధోషిగా తేల్చింది.   అత్యాచారం కేసులో ఆశారాం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా.. పలు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనను ధోషిగా తేల్చింది.

బుధవారం కోర్టు తీర్పు  నేపథ్యంలో శాంతి-భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం కోరింది. భద్రతను పటిష్ఠం చేయాలని, సున్నిత ప్రాంతాల్లో భద్రతాదళాలను మోహరించాలని సూచించింది. తీర్పు వెలువడిన జోధ్‌పుర్‌ న్యాయస్థానం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు డీఐజీ విక్రంసింగ్‌ తెలిపారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాహజాన్‌పుర్‌కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించినట్లు ఎస్పీ కె.బి.సింగ్‌ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులోనే ఈ రోజు తీర్పు వెలువరించారు. 2013 నుంచి ఆశారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 12 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది.

click me!