ట్రిపుల్ తలాఖ్‌ చెప్పి వివాహితపై భర్త, మరిది పలుమార్లు గ్యాంగ్ రేప్.. యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..!

By Mahesh KFirst Published Nov 12, 2022, 12:07 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సల్మాన్ అనే వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆమె తన తమ్ముడిని పెళ్లి చేసుకుని విడాకులు పొందితే ఆమెను మళ్లీ భార్యగా స్వీకరిస్తానని కండీషన్ పెట్టాడు. ఇందుకు ఆమె అంగీకరించి మోసపోయింది. వారిద్దరూ ఆమె పై పలుమార్లు గ్యాంగ్ రేప్ చేసి చిత్రహింసలు పెట్టారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ తలాఖ్ అని చెప్పి ఓ మహిళ జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేశారు. మతపెద్ద, కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఇద్దరు అన్నదమ్ములు ఆమె పై లైంగికదాడికి పాల్పడ్డారు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదు చేసిన మహిళ సల్మాన్ అనే యువకుడిని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఆ వివాహితకు ట్రిపుల్ తలాఖ్ అని చెప్పి విడాకులు ఇచ్చాడు. మన దేశంలో ట్రిపుల్ తలాఖ్ విధానం నిషేధం.

మత పెద్ద గుడ్డు హాజీ సూచనల మేరకు మల్లీ ఆమెను భార్యకు స్వీకరించడానికి సల్మాన్ అంగీకరించాడు. కానీ, అందుకు ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవాలని చెప్పాడు. ఆ మరో వ్యక్తి తన తమ్ముడే అని వివరించాడు. దీంతో ఆ మహిళ కంగారు పడింది. అయినప్పటికీ సల్మాన్ చెప్పిన షరతును స్వీకరించింది.

Also Read: ప్రభుత్వ హాస్పిటల్‌లో టీనేజీ బాలికపై ప్యూన్ అత్యాచారం.. ఢిల్లీలో ఘటన

ఆమె సల్మాన్ తమ్ముడు ఇస్లాంను పెళ్లి చేసుకుంది. కానీ, ఇస్లాం ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి సల్మాన్, ఇస్లాంలు ఆ మహిళను లైంగిక వేధించడం, రేప్ చేయడం ప్రారంభించారు. చాలా సార్లు సల్మాన్, ఇస్లాం ఆమె పై గ్యాంగ్ రేప్ కూడా చేశారని అదనపు ఎస్పీ సంజయ్ కుమార్ పీటీఐకి వెల్లడించారు.

సదరు బాధితురాలు తన ఫిర్యాదుతో స్థానిక కోర్టును ఆశ్రయించింది. సోమవారం ఆ కోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఈ ఫిర్యాదు ఆధారంగా గుడ్డు హాజీ, సల్మాన్, ఇస్లాం, వారి కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులపై గ్యాంగ్ రేప్, అసహజ సెక్స్, ముస్లిం విమెన్ ప్రొటెక్షణ్, రైట్స్ ఆన్ మ్యారేజీ యాక్ట్ 2019లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు.    

ఆ మహిళను మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులను అరెస్టు చేసే పనిలో నిమగ్నం అయినట్టు పోలీసు అధికారి వివరించారు.

click me!