ఈ రోజు టాప్ టెన్ వార్తలు.
వైసీపీకి ఓటెయ్యకండి: వైఎస్ సునీత
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత చెల్లి షర్మిల రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే మరో చెెల్లి సునీత వ్యక్తిగతంగా దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి కథనం
పవన్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ
అమరావతి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమసేన వ్యవస్థాపకుడు మాజీ మంత్రి చేగోండి హరిరామ జోగయ్య శుక్రవారం నాడు మరో లేఖ రాశారు.జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోవాలని ఆ లేఖలో హరిరామ జోగయ్య కోరారు. పూర్తి కథనం
కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దాం... సిరిసిల్ల నుండి పోటీ చేద్దామని కేటీఆర్ ను కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సిరిసిల్లలో కేటీఆర్ చేతిలో తాను ఓటమి పాలైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తన చేతిలో కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసివేయాలని ఆయన సవాల్ విసిరారు. పూర్తి కథనం
నేటి నుంచి గృహజ్యోతి
నేటి నుంచే గృహజ్యోతి పథకం అమలు అవుతుందని తెలుస్తున్నది. ఇవాళ్టి నుంచే జీరో కరెంట్ బిల్లులు జారీ అవుతాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్‌లలో నేటి నుంచే ఈ బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి కథనం
బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ
జహీరాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ నేత బీబీ పాటిల్ శుక్రవారం నాడు బీజేపీ లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. నిన్ననే నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పూర్తి కథనం
కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ మృతి
ఉత్తరాఖండ్, మిజోరాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించిన అజీజ్ ఖురేషీ (Aziz Qureshi passes away) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం చనిపోయారు. పూర్తి కథనం
`ఆపరేషన్ వాలెంటైన్` పై నెగటివ్ టాక్‌కి ఐదు కారణాలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా `ఆపరేషన్ వాలెంటైన్` సినిమాతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన సినిమాకి నెగటివ్ టాక్ వస్తోంది. దానికి ఐదు కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పూర్తి కథనం
ఈ భారత క్రికెట్ క్వీన్ ఎవరో తెలుసా?
అత్యంత ఖరీదైన ఇంట్లో నివాసముంటున్న భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోమిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు ముందు కనిపిస్తుంటారు. కానీ, వీరిందరి కంటే వేల కోట్ల విలువైన ఇంట్లో నివాసముంటున్నారు ఒక క్రికెటర్. ఆమె భారత క్రికెట్ క్వీన్ మృదుల జడేజా ! పూర్తి కథనం
రామేశ్వరం కేఫ్ పై సీఎం సిద్ధరామయ్య కామెంట్స్
రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాగ్‌లో నుంచి పేలుడు సంభవించిందని, ఆ బ్యాగ్‌ను ఓ వ్యక్తి వదిలిపెడుతుండగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడని వివరించారు. పూర్తి కథనం
ఎన్డీయేలో టీడీపీ చేరుతుందా?
ఏపీ విపక్ష శిబిరంలో పొత్తు పై అనిశ్చితి నెలకొంది. అసలు టీడీపీ ఎన్డీయేలో చేరుతుందా? లేదా? టీడీపీ, జనసేన దూకుడుతో బీజేపీ హర్ట్ అయిందా? టీడీపీకి బీజేపీ షాక్ ఇస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అంశంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి కథనం