మార్చి 3, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.
కలిసి పనిచేస్తాం.. మైలవరంలో ఒక్కటైన దేవినేని - బొమ్మసాని, వసంతకు సెగ తప్పదా..?
మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ ఖరారైనా.. దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వర్గాలు ఆయనకు సహకరిస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. వసంతకు చెక్ పెట్టేందుకే ఇద్దరు ఏకమయ్యారే టాక్ నడుస్తోంది. తొలుత దేవినేని, బొమ్మసాని వర్గాల మధ్య ఆధిపత్య పోరు వుండగా.. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో ఆ లెక్కలన్నీ మారి.. ఇద్దరు నేతలు చేతులు కలిపి ఒకే వేదికపైకి వచ్చారు. పూర్తి కథనం
మిషన్ 400 .. 10 రోజుల్లో , 12 రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు , షెడ్యూల్ ఇదే
త్వరలో లోక్‌సభ ఎన్నిలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సిద్ధమయ్యారు. వచ్చే పదిరోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మొత్తం 29 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్తి కథనం
బీజేపీ సీటు ఇచ్చినా.. తిరస్కరించిన అభ్యర్థి.. సారీ నేను పోటీ చేయలేనంటూ పోస్ట్..
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చాలా మంది నాయకులు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అయితే పోటీ మరింత ఎక్కువగా ఉంది. కానీ పిలిచి మరీ బీజేపీ సీటు ఇచ్చినా.. దానిని తిరస్కరించాడు ఓ అభ్యర్థి. నేను పోటీ చేయలేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఎవరా నాయకుడు ? ఏమిటా కథ ? పూర్తి కథనం
బీజేపీకి ప్రధాని మోడీ రూ.2,000 విరాళం.. దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు..
ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని అందజేశారు. విక్షిత్ భారత్ ను నిర్మించే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి తాను దోహదపడ్డానని ఈ సందర్భంగా ప్రధాని ఉద్ఘాటించారు. నమో యాప్ ద్వారా 'డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్'లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్తి కథనం
ఫ్యామిలీతో కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. ఏం జరుగుతోంది.?
బీఆర్ఎస్ నేత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వెంకట్రావు.. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వున్నారు. తెల్లం హస్తం తీర్ధం పుచ్చుకుంటారో లేక ఇది మర్యాదపూర్వక భేటీ అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. పూర్తి కథనం
పాకిస్తాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ .. రెండోసారి వరించిన అత్యున్నత పదవి
పాకిస్తాన్ నూతన ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఆయన పాక్ ప్రధాని కావడం ఇది రెండోసారి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్. నవాజ్ అసెంబ్లీలో సీటు గెలిచి.. ప్రధాని పదవిని ఆశించారు. అయితే ఆయన పార్టీ , మిత్రపక్ష పార్టీలు మాత్రం షెహబాజ్ పేరును ప్రతిపాదించారు. పూర్తి కథనం
ఐపీఎల్ 2024... స్టార్ ఆటగాళ్లతో ప్రోమో వీడియో రిలీజ్.. వైరల్
క్రికెట్ అభిమానులకు పండగలాంటి ఐపీఎల్ 2024 రాబోతోంది. స్టార్ స్పోర్ట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కు ముందు ఓ వీడియో ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నటించారు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇంకా మరెంతో దూరంలో లేదు. రెండు నెలల పాటు ఉత్కంఠ భరింతంగా సాగే ఈ పోటీలను చూసి క్రికెట్ అభిమానులు చిల్ అవుతారు. పూర్తి కథనం
`దేవర` ని వెంటాడుతున్న మూడు బ్యాడ్ సెంటిమెంట్లు.. ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేయగలడా?
ఎన్టీఆర్ చివరగా `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో నటించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు `దేవర` చిత్రంతో వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. భారీ బడ్జెట్, భారీ కాస్ట్యూమ్, లార్జ్ స్కేల్‌లో రూపొందుతుంది. ఈ మూవీపై ఎన్టీఆర్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీనితో పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ఈ మూవీ సక్సెస్ కూడా చాలా కీలకంగా మారింది. పూర్తి కథనం
Ileana DCruz : ప్రెగ్నెన్సీ తర్వాత ఇలియానాకు ఆరోగ్య సమస్యలు.. ఎలాంటి వ్యాధో స్వయంగా తెలిపిన స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ (Ilieana) కొన్నాళ్లుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చివరిగా ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో అలరించింది. ఆ తర్వాత పెద్దగా మూవీ అప్డేట్స్ లేవు. కానీ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది ఇలియాన. డెలివరీ తర్వాత తను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చింది. పూర్తి కథనం
మహేశ్ బాబు ఇష్టపడి నటించిన ఆ రెండు చిత్రాలు.. భార్య నమత్రకు అస్సలు నచ్చవంట!
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోధ్కర్ (Namrata Shirodkar) భర్త నటించిన సినిమాలపై ఆసక్తికరంగా స్పందించింది. ఆ రెండు సినిమాలంటే తనకు నచ్చవని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. రీసెంట్ గా తను ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే...పూర్తి కథనం