మిషన్ 400 .. 10 రోజుల్లో , 12 రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు , షెడ్యూల్ ఇదే

By Siva Kodati  |  First Published Mar 3, 2024, 5:09 PM IST

త్వరలో లోక్‌సభ ఎన్నిలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సిద్ధమయ్యారు. వచ్చే పదిరోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మొత్తం 29 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.


త్వరలో లోక్‌సభ ఎన్నిలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సిద్ధమయ్యారు. వచ్చే పదిరోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మొత్తం 29 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న మోడీ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ , రాజస్థాన్, ఢిల్లీల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 

తొలుత మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మోడీ పర్యటిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కల్పకమ్‌లో వున్న భారతీయ నభికియా విద్యుత్ నిగం లిమిటెడ్‌ను సందర్శిస్తారు. మార్చి 5న మరోసారి తెలంగాణకు చేరుకుని సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశాలోని చండీఖోలేలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి మార్చి 6న బెంగాల్‌కు వెళ్తారు. కోల్‌కతా, బరాసత్‌లలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించి అక్కడి నుంచి బీహార్‌కు వెళ్తారు. 

Latest Videos

undefined

మార్చి 7న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, మార్చి 8న ఢిల్లీలో జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం అస్సాంకు చేరుకుని జోర్హాట్‌లో దిగ్గజ ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదే రోజున అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించి.. ఇటానగర్‌లో అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆవిష్కరిస్తారు. తర్వాత బెంగాల్‌లోని సిలిగురిలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 

మార్చి 10న ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో పలు ప్రాజెక్ట్‌లను జాతికి అంకితమిస్తారు. తర్వాతి రోజు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను మోడీ ప్రారంభిస్తారు. అదే రోజున డీఆర్‌డీవో కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12న గుజరాత్, రాజస్థాన్‌లలో.. మార్చి 13న గుజరాత్, అస్సాంలలో జరిగే కార్యక్రమాలకు నరేంద్ర మోడీ హాజరవుతారు. 
 

click me!