మార్చి 2, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.
కేసీఆర్ కు అల్లుడి పోటు... హరీష్ కూడా బిఆర్ఎస్ నుండి జంప్.. : కోమటిరెడ్డి సంచలనం
తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటికైనా మేనల్లుడి పోటు తప్పదని ప్రత్యర్థి పార్టీలు అంటూ వుంటాయి. తాజాగా ఆ సమయం దగ్గరకు వచ్చిందని... త్వరలోనే హరీష్ రావు పార్టీ మారబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంతకూ హరీష్ ఏ పార్టీలో చేరతారంటే... పూర్తి కథనం
వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి .. ఆ జీవో ఒక్కటే మిగిలుంది : మల్లవరం ఘటనపై పవన్ ఫైర్
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్ధితి రావడం దురదృష్టకరమన్నారు. తాగునీరు పట్టుకునేందుకు ఆమె ట్యాంకర్ వద్దకు వెళ్లడం, ఇంట్లో తాగేందుకు నీళ్లు లేవని ప్రాధేయపడినా అవతలి పార్టీ వారు అడ్డుకుని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ.. ఎందుకంటే.. వీడియో వైరల్
భారత కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశంతో పాటు విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి కథనం
డోన్‌లో టీడీపీ నేతల పోటాపోటీ ర్యాలీలు: మీసం మేలేసిన సుబ్బారెడ్డి
తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు చివరి వరకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ టిక్కెట్టు కేటాయించింది. అయితే మూడేళ్ల క్రితం డోన్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. ధర్మవరం సుబ్బారెడ్డి ఇవాళ డోన్ లో బల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా సుబ్బారెడ్డి మీసం మేలేశాడు. పూర్తి కథనం
పి.గన్నవరం బరిలోంచి తప్పుకున్న మహాసేన రాజేశ్.. కుల రక్కసికి బలైపోయానంటూ ఆవేదన
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మహాసేన రాజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల బరిలోంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కులరక్కసి చేతిలో మరొక్కసారి బలైపోయాను.. జగన్ రెడ్డి.. గుర్తుపెట్టుకుంటాను.. నా కోసం నా పార్టీని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ను ఎవ్వరూ తిట్టొద్దు.. నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను’’ అని రాజేశ్ పేర్కొన్నారు. పూర్తి కథనం
బీజేపీలో కలకలం .. గంభీర్ బాటలోనే , ఎన్నికల విధుల నుంచి తప్పించండి: నడ్డాను కోరిన ఎంపీ జయంత్ సిన్హా
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జయంత్ సిన్హా పార్టీలో కలకలం రేపారు. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సిన్హా అభ్యర్ధించారు. ఆయన వైఖరిని చూస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదన్న సంకేతాలు పంపుతోంది. పూర్తి కథనం
క్రిష్ కు విడాకులిచ్చిన భార్య.. పెళ్లైన రెండేళ్లకే ఎందుకు వదిలేసిందో తెలుసా?
క్రిష్ గురించిన కొన్ని విషయాలు ప్రస్తుతం మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన డివోర్స్ మేటర్ తెరపైకి వచ్చింది. పెళ్లైనా రెండేళ్లకే క్రిష్ విడిపోవడానికి కారణం ఏంటంటూ ఆలోచిస్తున్నారు. 2016లో రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్న క్రిష్ 2018లోనే డివోర్స్ తీసుకున్నారు. అందుకు కారణం కూడా ఆసక్తికరంగా మారింది. పూర్తి కథనం
ఈ ముగ్గురు బడా దర్శకుల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు!
రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, పూరి జగన్నాధ్.. వీరు దేశం మెచ్చిన దర్శకులు. ట్రెండ్ సెట్టర్స్. ఈ ముగ్గురు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి కథనం
బేగంపేట ఎయిరో పోర్టో లో ఎన్టీఆర్ - రామ్ చరణ్, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు..?
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు, ఆర్ఆర్ఆర్ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంత క్లోజ్ గా ఉంటారో తెలిసిందే. ఈసినిమాకు ముందు నుంచే వారు మంచి ఫ్రెండ్స్ కాగా.. ఆర్ఆర్ఆర్ టైమ్ లో వారి అనుబంధం మరింతగా పెరిగిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరి కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో కూడా తెలిసిందే. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ ఇద్దరు హీరోలు కలుసుకున్నారు. కాసేపు సందడి చేశారు. పూర్తి కథనం
టీమిండియా పై బిగ్ అప్డేట్.. వివరాలు ఇవిగో..
మరో మెగా క్రికెట్ ఈవెంట్ కు సర్వం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఐసీసీ వేగంగా పూర్తి చేస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ సారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ), వెస్టిండీస్‌లోని వివిధ వేదికలలో సంయుక్తంగా మెగా టోర్నీని నిర్వహించనున్నారు. పూర్తి కథనం