Top Ten News @6PM: ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

By Mahesh K  |  First Published Feb 23, 2024, 5:57 PM IST

ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే.
 


Top Ten News: 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్తి, పోస్టుమార్టం రిపోర్ట్:

Latest Videos

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, దివంగత సాయన్న కూతురు లాస్య నందిత ఈ రోజు ఔటర్ రింగ్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాంధీలో ఆమె డెడ్ బాడీకి పోస్టు మార్టం నిర్వహించి రిపోర్టు విడుదల చేశారు. పూర్తి కథనం

సాయన్న నోచుకోలే.. అధికారికంగా లాస్య నందిత అంత్యక్రియలు

సిట్టింగ్ ఎమ్మెల్యే జీ సాయన్న గతేడాది ఫిబ్రవరిలో మరణించినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దళితులపై వివక్షతోనే చేపట్టలేదని పలువురు ఆరోపణలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన బిడ్డ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం

ఇంట్లో దీపం వెలిగించి మేడారం జాతరకు.. పేలిన సిలిండర్

కరీంనగర్ జిల్లాలో ఆదర్శ్ నగర్‌లో కూలీలు ఎక్కువగా ఉండే చోట.. ఓ కుటుంబం ఇంటిలో దీపం వెలిగించి మేడారం జాతరకు వెళ్లింది. ఆ దీపం నుంచి మంటలు ఇంటిలోని ఇతర వస్తువులకు పాకింది. చివరకు వంట సిలిండర్ పేలింది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానికుల భయాందోళనలతో పరుగులు తీశారు. పూర్తి కథనం

లెఫ్ట్‌తో కాంగ్రెస్ పొత్తు.. వామపక్ష నేతలతో షర్మిల భేటీ

ఏపీలో కాంగ్రెస్ పార్టీ.. లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ మేరకు సీపీఐ, సీపీఎం నాయకులతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో తలపెట్టిన సభకు లెఫ్ట్ పార్టీలను ఆహ్వానించారు. పూర్తి కథనం

జగన్ ప్రసంగంలో భువనేశ్వరి వ్యాఖ్యలు

ఇటీవలే కుప్పంలో ప్రజలతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఒంగోలు సభలో సీఎం జగన్ ప్రస్తావించారు. కుప్పంలోనే చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని భార్య భువనేశ్వరి చెబుతున్నదని పేర్కొన్నారు. పూర్తి కథనం

లోక్ షభ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే!

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 13వ తేదీ తర్వాత వెలువడే అవకాశాలు ఉన్నాయని ఈసీ వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు రాష్ట్రాల్లో ఏర్పాట్లపై పర్యటనలు, సంప్రదింపులు పూర్తవుతాయని వివరించాయి. ప్రస్తుతం ఈసీ ప్రతినిధులు తమిళనాడులో పర్యటిస్తున్నారు. పూర్తి కథనం

‘నేడు బ్లాక్ ఫ్రైడే!’

రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై సుదీర్ఘ పోరాటాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో ఓ అపశృతి చోటుచేసుకుంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఓ రైతు మరణించాడు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తూ.. నేడు బ్లాక్ ఫ్రైడే పాటించాలని రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. పూర్తి కథనం

మమ్ముట్టి భ్రమయుగం రివ్యూ

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రయోగాలు ఆపడం లేదు. తాజాగా సైకలాజికల్ హారర్ - థ్రిల్లర్ సినిమాలో నటించారు. అది ఈ రోజు విడుదలైంది. విమర్శకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రివ్యూ చదవండి. పూర్తి కథనం

గేమ్ ఛేంజర్ నుంచి లీకులు

మెగా పవర్ స్టార్ రాంచరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో గేమ్ ఛేంజర్ సినిమా రానుంది. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నది. అయితే.. ఈ చిత్ర యూనిట్‌కు లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమాలో చరణ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. ఒక పాత్రను ఇది వరకే విడుదల చేశారు. కాగా, మరో పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లీక్ అయ్యాయి. పూర్తి కథనం

టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్

భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓడిపోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఇండియా గెలిచింది. నాలుగో టెస్టు మ్యాచ్ రాంచీలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియాలోకి కొత్త ప్లేయర్‌గా ఆకాశ్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి కథనం

click me!