ఓ కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లింది. వెళ్లే ముందు ఇంట్లో దేవుడి ఫొటోల దగ్గర దీపం వెలిగించింది. దీని వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. (Fire breaks out in Karimnagar) ఈ మంటల వల్ల ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. (Gas cylinder explodes in Karimnagar)

ఇంట్లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సిలిండర్ పేలిన సమయంలో వచ్చిన శబ్బం విని స్థానికులు ఒక్క సారిగా పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదం స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. 

కరీంనగర్ సిటీలోని ఓ కాలనీలో నివసిస్తున్న కుటుంబం ఇంట్లో దేవుడి మండపం దగ్గర దీపం వెలిగించింది. అనంతరం ఆ కుటుంబ సభ్యులంతా మేడారం జాతరకు వెళ్లారు. అయితే ఆ దీపం తిరగబడిందో ఏమో తెలియదు గానీ.. ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకొని, మంటలు చెలరేగాయి.

Scroll to load tweet…

ఈ ప్రమాదాన్ని చూసేందుకు ఆ ఇంటికి సమీపంలో జనం గుమిగూడారు. ఈ క్రమంలో మంటల వల్ల ఆ ఇంట్లో ఉన్న సిలిండర్ ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో పాటు మంటలు పైకి లేచాయి. ఈ శబ్ధానికి జనాలు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కాగా.. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

కాగా.. ప్రమాదం జరిగిన ఇంటి నుంచి నల్లటి పొగలు రావడం, దానిని చూసేందుకు జనం గుమిగూడటం, గ్యాస్ సిలిండర్ పేలడంతో పరుగులు తీయడం అంతా ఒకరు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. వలస కార్మిక వర్గానికి చెందిన అనేక కుటుంబాలు అక్కడ నివసిస్తాయని, వారంతా మేడారం జాతరకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.