లంబోర్ఘినిపై భారతీయ యువత ఫిదా.. తెగ కొనేస్తున్నారట..

By SumaBala Bukka  |  First Published Feb 23, 2024, 4:46 PM IST

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతదేశంలో 40 ఏళ్లలోపు ఉన్న కొనుగోలుదారులలో ఎక్కువ మంది యువకులేనని లంబోర్ఘిని గ్లోబల్ సీఈఓ స్టీఫన్ వింకెల్‌మాన్ వెల్లడించారు.


లంబోర్గిని.. కారు ప్రియులకు అత్యంత ఇష్టమైన కారు.  ప్రపంచంలోనే  ఖరీదైన కార్లలో ఒకటి. కార్లో కార్లను ఇష్టంగా నడిపేవారు జీవితంలో ఒక్కసారైనా లంబడిగిని నడపాలని ఆశ పడుతుంటారు. ఒకప్పుడు ఇది విదేశాల్లోనే ఎక్కువగా వాడేవారు కానీ ఇప్పుడు మన దేశ యువత కూడా ఈ కార్లపై ఎక్కువ మోజు పడుతున్నారని… వీలైతే కొనాలని లేదంటే ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని అనుకుంటున్నారని లంబోర్గిని కార్ల కంపెనీ సీఈఓ అంటున్నారు.

అంతేకాదు ఇండియాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో లంబడిని అమ్మకాలు జరిగాయని ఇది గతే ఏడాదితో పోలిస్తే ఎక్కువ అని చెబుతున్నారు. ఇక అమెరికా యూరప్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన భారతీయ యువకులు ఈ కార్లను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Latest Videos

Lok Sabha Elections: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్!.. ఈసీ వర్గాల వెల్లడి

ఈ కార్ల డిమాండ్ ఆశ్చర్యంగా కోవిడ్ తర్వాత రోజురోజుకు పెరుగుతుందని ఆ సంస్థ చైర్మన్ చెబుతున్నారు. ఈ కార్లను బుక్ చేసిన తర్వాత 18 నుంచి 24 నెలల మధ్య డెలివరీ అవుతుంది.  అంటే దాదాపుగా వెయిటింగ్ పీరియడ్ ఎన్ని నెలలు ఉన్నప్పటికీ అమ్మకాలు కానీ తగ్గడం లేదని చెబుతున్నారు. 

భారతీయులు విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఖరీదైన ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయడం మాత్రమే కాదు, ప్రపంచంలోనే లంబోర్ఘిని వంటి స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేసే అతి పిన్న వయస్కులు కూడా భారతీయులేనట. 

"ఆసియాలో కాకుండా భారతదేశంలోని మా కస్టమర్‌లలో యువకులే ఎక్కువగా ఉన్నారు. 40 ఏళ్లలోపు వారే ఎక్కువ. అమెరికాలో మా కొనుగోలుదారులలో ఎక్కువ భాగం 40 - 45 సంవత్సరాల మధ్య వారే, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉందంటే.. వారు మా కస్టమర్లలో ఎక్కువ వయసున్నవారని అర్థం.. అని వింకెల్మాన్ చెప్పుకొచ్చారు. 

ఆయన మాట్లాడుతూ భారతీయులకు బ్రాండ్ గురించి "అద్భుతమైన" అవగాహన కూడా ఉందన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఎక్కువగా లంబోర్ఘిని కార్లను కొంటున్నారు. మనదేశంలో అమ్మకాల గణాంకాలు చాలా తక్కువగానే ఉన్నా...2023లో 103 కార్లను అమ్మింది. వేరే దేశాలతో పోలిస్తే ఇండియాలో, ఇండియన్స్ లో ఈ కారుకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. 

ఈ కారు కొనడానికి రూ.4 కోట్లనుంచి రిటైల్ గా కొనడానికి, అంత డబ్బు ఖర్చు పెట్టానికి విదేశీయులతో పోటీ పడుతున్నారని వింకెల్ మాన్ తెలిపారు. కొనుగోలుదారుల ఆసక్తిని బట్టి మోడల్ కార్లను తయారు చేయడానికి తాము రెడీగా ఉన్నామంటున్నారాయన. 

click me!