లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ షెడ్యూల్ మార్చి 13వ తేదీ తర్వాత విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈసీ వర్గాలు తెలిపాయి.
Election Commission: లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో పలు విడుతల్లో జరగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో కూర్పులో ఉన్నాయి. కొన్ని పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాయి. అందరి చూపు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువుడుతందా? అని ఎన్నికల సంఘంపైనే ఉన్నాయి. ఈ షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందో ఈసీ వర్గాలు కొన్ని సంకేతాలను ఇచ్చాయి.
ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల తేదీలను మార్చి 13వ తేదీన విడుదల చేసేఅవకాశం ఉన్నదని ఆ వర్గాలు వివరించాయి. ఇప్పటికే జనరల్ ఎలక్షన్స్ నిర్వహణ కోసం ఏర్పాట్ల గురించి పలు రాష్ట్రాల్లో ఈసీ పర్యటించింది. ఈ కసరత్తు పూర్తవ్వగానే తేదీలను ప్రకటించనున్నట్టు ఈసీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఈ ప్రతినిధుల బృందం ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లలో పర్యటన చేయనున్నాయి. ఈ రాష్ట్రాల పర్యటన మార్చి 13వ తేదీలోపే ముగియనున్నాయి. ఆ తర్వాత ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది.
Also Read: CBN: కూటమి కుదిరినట్టే! వైసీపీపై దాడికి డేట్ కూడా ఫిక్స్
ఈ ఎన్నికల్లో ఈసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిసింది. లోక్ సభ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడానికి కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించనుంది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై నుంచి తప్పుడు సమాచారాన్ని, అభ్యంతరకర సమాచారాన్ని తొలగించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఒక వేళ రాజకీయ పార్టీ లేదా.. నాయకుడు తరచూ నిబంధనలను ఉల్లంఘించినట్టైతే.. ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సదరు అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ఆ సామాజిక మాధ్యమాన్ని ఆదేశిస్తుంది.