Top 10 Telugu News: శుభోదయం..ఇవాళ్టీ telugu.asianetnews టాప్ టెన్ వార్తలు ఇవే..
Top 10 Telugu News: (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)కి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గుమ్మనూరు జయరాం ప్రకటించారు. మంగళవారం నాడు విజయవాడలో మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.
జగన్‌కు దేవినేని ఉమ సవాల్
Devineni Uma: మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఆయన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై చర్చకు సిద్ధమా? చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం జగన్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని, దాన్ని గుండెపోటుగా మభ్యపెట్టాలని ప్రయత్నించినట్టు దేవినేని ఉమ అన్నారు. కానీ, చివరికి అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని బయటపడిందని పేర్కొన్నారు.
"విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా"
రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖపట్టణంలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఈ దఫా విశాఖపట్టణంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు. చెన్నై, హైద్రాబాద్ లకు ధీటుగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేస్తానని జగన్ చెప్పారు. .
అనూహ్య పరిణామం.. బీఆర్ఎస్, బీఎస్పీల దోస్తీ..
తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోసిన బీఎస్పీ తిరిగి ఆ పార్టీతోనే దోస్తీ పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మంగళవారం భేటీ అయ్యారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం: మోడీ
అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తనను విమర్శిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు.కుటుంబ పార్టీలతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని మోడీ చెప్పారు.యువతకు అవకాశాలు రావడం లేదన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువని మోడీ విమర్శించారు.
ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: రాహుల్ పోటీపై రాని స్పష్టత
పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది.ఈ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం వచ్చిన ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారు. ఈ నెల 7న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో తెలంగాణ నుండి పంపిన అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
స్తంభించిన ఇన్‌స్టా, ఫేస్‌బుక్ సేవలు..
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్లు సర్వర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేజ్ లోడింగ్‌లో సమస్య వస్తున్నదని చాలా మంది యూజర్లు చెబుతున్నారు. అయితే.. ఈ సమస్యపై మెటా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ఈ సమస్య అంతర్జాతీయంగా ఉన్నట్టు తెలిసింది.
లోక్ సభ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15వ తేదీన షెడ్యూల్డ్ (Lok Sabha Election Schedule) విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2019 మాదిరిగానే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ‘ఏబీపీ న్యూస్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ రెండో వారంలో మొదటి దశ పోలింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంది. మార్చి 14 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.
డీఎంకే లోక్ సభ ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది ఒక దేశం కాదని పేర్కొంటూ కొత్త వివాదాన్ని రేపారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అనే నినాదాలను ఆయన తప్పుపట్టారు.
బాలీవుడ్‌లోని ఎన్టీఆర్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే!
NTR: ఎన్టీఆర్ మొన్నటి వరకు తెలుగు హీరోగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ `ఆర్‌ఆర్‌ఆర్`తో ఆయన ఇమేజ్ పాన్ ఇండియా దాటింది. ఇతర దేశాల ఆడియెన్స్ ఆయన నటనకు కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ పూర్తి స్థాయిలో ఆయనకు ఆ ఇమేజ్ రాలేదు. `దేవర` మూవీతో పాన్ ఇండియాలో సత్తా చాటబోతున్నారు తారక్. ఈ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే ఆయన బాలీవుడ్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతాడని చెప్పొచ్చు.