Today's Top Stories: ముగిసిన పార్లమెంటు సమావేశాలు .. రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్.. అండర్-19 టైటిల్ పోరు నేడే..

By Rajesh Karampoori  |  First Published Feb 11, 2024, 7:31 AM IST

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ,రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్,  అండర్-19 ఫైనల్స్  నేడే,2024 ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా, భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు, రూ. 2, 75,891కోట్లతో తెలంగాణ బడ్జెట్,  బీఆర్ఎస్ కు ఉత్త‌మ్ కుమార్ వార్నింగ్, రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్‌లో భాగ్యనగరంపై ఫోకస్, 'జాబ్ క్యాలెండర్‌పై కార్యాచరణ', ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారు, త్వరలోనే పొత్తులపై స్పష్టత: కేంద్ర మంత్రి అమిత్ షా వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories: ముగిసిన పార్లమెంటు సమావేశాలు 

Parliament: సార్వత్రిక ఎన్నిక ముందు ఏర్పాటు చేసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సారి సమావేశంలో పలు కీలక బిల్లులు ఆమోదించబడ్డాయి.  చివరి రోజు సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఐదేళ్లలో లోక్ సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూశానని స్పష్టం చేశారు. కొన్నిసార్లు  సభా మర్యాదలు, గౌరవం కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

Latest Videos

2024 ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా తాము మళ్లీ ప్రతిపక్ష బెంచ్‌లలో కూర్చోవాల్సి వస్తుందని గ్రహించాయని అమిత్ షా నొక్కి చెప్పారు.

Miss World 2024 : భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు...

న్యూ ఢిల్లీ : మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు ఇండియాలో జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ భారత్ లో జరగబోతోంది. ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC)చే "ది ఓపెనింగ్ సెర్మనీ", "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈ పోటీ ప్రారంభమవుతుంది.

రూ. 2, 75,891కోట్లతో తెలంగాణ బడ్జెట్ 

తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం  బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  శనివారం నాడు  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  తొలిసారిగా బడ్జెట్ ను  మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ బడ్జెట్ ను 2024-25 ఆర్ధిక సంవత్సరానికి  రూ. 2, 75,891 కోట్లతో  రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రెవిన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు, ద్రవ్యలోటు రూ.32,557 కోట్లుగా, రెవిన్యూ మిగులు రూ. 5,994 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది.ఆరు గ్యారెంటీలకు రూ. 53, 196 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయానికి రూ. 19, 746 కోట్లు, ఐటీ శాఖకు  రూ. 774 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11, 692 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.మూసీ ప్రాజెక్టుకు  రూ. 1000 కోట్లు, విద్యారంగానికి రూ, 21, 389 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 

బీఆర్ఎస్ కు ఉత్త‌మ్ కుమార్ వార్నింగ్

Uttam Kumar Reddy: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంద‌రి ప్ర‌యోజ‌నాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ద‌ని తెలంగాణ పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ఆర్థిక పునరుజ్జీవనానికి మధ్యంతర బడ్జెట్‌ బలమైన పునాది వేసి అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వంలోని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

"నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే.. గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదు"

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకపడ్డారు. నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదనీ, ఆ విషయం  బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుందని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,01,116 అందజేసిందని, తులాల బంగారం కానుకగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్‌లో భాగ్యనగరంపై ఫోకస్

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో హైదరాబాద్ నగరానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. సిటీని మూడు జోన్లుగా విభజించి.. అభివృద్ధి ప్రణాళికలు రచిస్తామని, అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధిలోకి తీసుకురావటానికి త్వరలోనే విధి విధానాలు కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తామని.. అర్బన్ జోన్‌గా ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం, పెరి అర్బన్ జోన్‌గా ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం , గ్రామీణ జోన్‌గా ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతం వుంటాయని ఆయన పేర్కొన్నారు. 

సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..  

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా, దిక్కుతోచనిదిగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలుకు కనీసం రూ.1.25 లక్షల కోట్లు అవసరమన్నారు. అయితే బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఆరు హామీల్లో 13 ప్రధాన హామీలు ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు. ఇంకా, కాంగ్రెస్ పార్టీ మొత్తం 420 వాగ్దానాలు చేసిందనీ, అయితే ఆ హామీలను ఎలా నెరవేరుస్తుందనే దానిపై స్పష్టత లేదని అన్నారు.

'జాబ్ క్యాలెండర్‌పై కార్యాచరణ'

ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీ మేరకు  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో  తమ ప్రభుత్వం  కార్యాచరణను సిద్దం చేస్తుంది.జాబ్ క్యాలెండర్  తయారు చేసే ప్రక్రియను ప్రారంభించినట్టుగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.మెగా డీఎస్‌సీని కూడ నిర్వహించనున్నట్టుగా   మల్లు భట్టి విక్రమార్క  వివరించారు. దాదాపు 15 వేల మంది కానిస్టేబుల్ పోస్టులను రిక్రూట్ మెంట్ చేయనున్నట్టుగా  ఆయన తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లో  తాజాగా  64 పోస్టులను పెంచినట్టుగా  మంత్రి గుర్తు చేశారు. గతంలోనే  500 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
 
ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారు.
 

Pawan Kalyan: ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.  ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.


త్వరలోనే పొత్తులపై స్పష్టత: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో శనివారం నాడు  ఓ పత్రిక నిర్వహించిన సదస్సులో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు.రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు.ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా చెప్పారు.

అండర్-19 ఫైనల్స్  నేడే.. టైటిల్ పోరులో భారత్ తో ఆసీస్..
  
Under-19 World Cup Finals : అండర్‌-19 చివరికి అంకానికి చేరుకుంది. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 టైటిల్ పోరులో నేడు భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా..  టీమిండియాకు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది తొమ్మిదో సారి. వ‌రుస‌గా ఐదోసారి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సార్లు ఫైన‌ల్ మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇప్పుడూ ఉద‌య్ స‌హార‌న్ నేతృత్వంలో బ‌రిలో దిగుతున్న టీమిండియా టైటిల్ గెలిచేనా లేదా అనేది వేచిచూడాలి
 

click me!