Parliament: ముగిసిన లోక్ సభ సమావేశాలు... ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

By Rajesh KarampooriFirst Published Feb 11, 2024, 6:43 AM IST
Highlights

Parliament: సార్వత్రిక ఎన్నిక ముందు ఏర్పాటు చేసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సారి సమావేశంలో పలు కీలక బిల్లులు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగమిచ్చారు. 

Parliament: సార్వత్రిక ఎన్నిక ముందు ఏర్పాటు చేసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సారి సమావేశంలో పలు కీలక బిల్లులు ఆమోదించబడ్డాయి.  చివరి రోజు సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఐదేళ్లలో లోక్ సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూశానని స్పష్టం చేశారు. కొన్నిసార్లు  సభా మర్యాదలు, గౌరవం కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

అనంతరం పార్లమెంట్ బడ్జెట్ చివరి రోజు సమావేశంలో  ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలను వివరించారు. బీజేపీ పాలనలో పార్లమెంటులో చేసిన అనేక సంస్కరణలు దేశ గతిని మార్చాయనీ,రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ అనే మూడు సూత్రాల ప్రాతిపదికగా ముందుకెళ్తున్నామని, గత  పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగాయని ప్రధాని మోదీ అన్నారు. ఎంపీల నూతన భవనంపై చాలా కాలంగా చర్చ జరుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలో దేశానికి కొత్త పార్లమెంటు భవనం వచ్చిందనీ, అందులో పేపర్‌లెస్ పార్లమెంట్ ప్రారంభించబడిందని తెలిపారు. 

Latest Videos

'ఆర్టికల్ 370 తొలగించబడింది'

జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం, మహిళా రిజర్వేషన్ చట్టం చేయడం, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం, శిక్షాస్మృతి స్థానంలో జ్యుడీషియల్ కోడ్‌తో సహా అనేక బిల్లులను 17వ లోక్‌సభలో ఆమోదించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సభ తొలగించిందని అన్నారు. తన హయాంలోనే భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించిందని చెప్పారు. సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు భారత్ విచ్చేశారు. భారత ప్రజాస్వామ్య విలువలు ప్రపంచ వ్యాప్తమయ్యాయని అననారు. 17వ లోక్‌సభ తొలి సెషన్‌లో 30 బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయని, ఇది ఒక రికార్డు అని ప్రధాని అన్నారు.

'ఉగ్రవాదంపై కఠిన చట్టం'

ఉగ్రవాదం భారత్‌కు శాపంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని యువత తీవ్రవాద బాధితులుగా మారారని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించింది. 

పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా చట్టం 

గత ఐదేళ్లలో యువత కోసం చారిత్రాత్మక చట్టాలు చేశామని, పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా బిల్లును ఆమోదించామని ప్రధాని మోదీ అన్నారు. ఇది కాకుండా.. దేశంలోని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పార్లమెంటు కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 16-17 వేల మంది ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు అందించబడ్డాయని ప్రధాని తెలిపారు. వచ్చే 25 సంవత్సరాలు భారత్ ప్రస్థానంలో ఎంతో కీలకంగా నిలుస్తాయని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

click me!