అమెరికా తరహలో మల్టీ డిస్ట్రిక్ట్ జ్యుడిషీయల్ ప్యానెల్: సుప్రీంకోర్టు సూచన

By narsimha lodeFirst Published Jan 18, 2022, 9:09 PM IST
Highlights

ఒకే వ్యక్తిపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్లబ్ చేసి విచారణ చేసేందుకు మల్టీ డిస్ట్రిక్ట్ జ్యూడిషీయల్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.

 న్యూఢిల్లీ:USA లో ఏర్పాటు చేసిన తరహాలోనే మల్టీడిస్ట్రిక్ట్ లిటిగేషన్ పై జ్యుడిషీయల్ ప్యానెల్ లాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది ఒకే వ్యక్తిపై వివిధ రాష్ట్రాల్లో  పలు Fir లు నమోదైతే .. దాని పరిష్కారం కోసం ఈ తరహా యంత్రాంగం పనికొస్తుందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తరహ అనేక రకాల కేసుల  పరిష్కారాలను ప్రతిపాదిస్తూ ప్రతిస్పందించాలని కేంద్రాన్ని కోరింది Supreme court. 

ఎల్. నాగేశ్వరరావు, బీఆర్ గవల్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ రాధేశ్యామ్ తరపున సీనియర్ న్యాయవాది Kapil Sibal వాదనలను విన్నది.గతంలో జరిగిన విచారణ సమయంలో 20 ఎఫ్ఐఆర్ లను కలిపి విచారణ చేయాలని పిటిషన్ దాఖలైంది. ప్రజలను  మభ్య పెట్టి డబ్బు వసూలు చేశారని  రాధేశ్యామ్ పై కేసులు నమోదయ్యాయి.ఈ విషయమై తన క్లయింట్ తరపున కపిల్ సిబల్ వాదనలు విన్పించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వి. రాజేష్ శ్యాల్  మధ్య కేసు విషయమై సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా కపిల్ సిబల్ ప్రస్తావించారు. బాధితుడు, నిందితుల మధ్య జరిగే ప్రతి డిపాజిట్ ఒప్పందాన్ని అపెక్స్ కోర్టు ప్రత్యేక లావాదేవీలుగా పరిగణించిందన్నారు.

సీఆర్‌పీసీ లోని సెక్షన్లు 218, 220 వర్తించే నిబంధనలు ఉన్నందున అతని కేసు ప్రత్యేకించదగిందని కపిల్ సిబల్ వాదించారు. అయితే విచారణకు సొలిసిటర్ జనరల్ హాజరు కాకపోవడంతో బెయిల్ ధరఖాస్తును వాదించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. తన క్లయింట్ 2018 నుండి జైలులోనే ఉన్నాడని కపిల్ సిబల్ తెలిపారు. ప్రస్తుతం 2022 ఏడాది నడుస్తుందని  సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ధరఖాస్తు ఉందని కూడా కపిల్ సిబల్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. బెయిల్ ధరఖాస్తును వచ్చే వారం దాఖలు చేస్తానని కోవిడ్ నేపథ్యంలో మ:ద్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిల్ ధరఖాస్తును దాఖలు చేస్తే దానిని వచ్చే వారం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

అయితే ఆలస్యంగా ఈ కేసు విచారణలో సొలిసిటర్ జనరల్ పాల్గొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ల విషయమై కపిల్ సిబల్ లేవనెత్తిన అంశాలపై సొలిసిటర్ జనరల్ తన వాదనలను విన్పించారు.కపిల్ సిబర్, సొలిసిటర్ జనరల్ తమ వాదనలను కోర్టు ముందుంచారు.. అయితే ఇదే సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం వర్సెస్ భగవాన్ దాస్ అగర్వాల్ ఓర్స్ కేసును ఈ సందర్భంగా కపిల్ సిబల్ కోర్టు ముందు ప్రస్తావించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.సుప్రీంకోర్టు జడ్జి రావు అమెరికాలోని  ఓషా ఈటీఎస్ ప్రోసిడింగ్స్ ను   కపిల్ సిబల్  దృష్టికి తెచ్చారు. పలు సర్క్యూట్ ల ముందు అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. మల్టీ డిస్ట్రిక్ట్ పై  ఏర్పాటు చేసిన లిటిగేషన్ అన్నింటిని ప్రత్యేకంగా క్లబ్ చేసి ఆరో సర్క్యూట్ కు పంపిందని  జస్టిస్ తెలిపారు.  Indiaలో కూడా ఇదే తరహ విధానాన్ని అవలంభించే అవకాశాలను అన్వేషించాలని కూడా బెంచ్ సూచించింది.
బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయాలని కపిల్ సిబల్ ను కోరింది. ఈ విషయాన్ని సోమవారం నాడు పరిశీలిస్తామని బెంచ్ తెలిపింది.

click me!