హత్రాస్ కేసు:తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Oct 15, 2020, 3:41 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై  విచారణను పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై  విచారణను పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

గత నెలలో హత్రాస్ లో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించింది.అయితే బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టుగా ఆధారాలు లేవని ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక తెలిపిందని యూపీ ఏడీజీ ప్రకటించిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.

కేసు విచారణను ఏ కోర్టు పర్యవేక్షిస్తోందనే దానిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కోర్టుకు తెలిపారు.
కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని బాధితురాలి తరపు న్యాయవాది సీమ కుష్వాహ డిమాండ్ చేశారు.

పలువురు న్యాయవాదులు, ఇతర సంస్థల సలహాలతో కురిసినప్పుడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తమకు మొత్తం ప్రపంచం సహాయం అవసరం లేదన్నారు.

also read:యూపీకి కేసు బదిలీ చేయాలి, రక్షణ కల్పించాలి: హత్రాస్ బాధిత కుటుంబం

విచారణను ప్రభావితం చేయడానికి దర్యాప్తు రికార్డులను మీడియాలో ఇవ్వడాన్ని సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లుథ్రా ఈ సందర్భంగా ప్రస్తావించారు.దర్యాప్తు స్టేటస్ రిపోర్టును యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టుకు సమర్పించాలని బాధిత కుటుంబం తరపు న్యాయవాది కోరారు.

ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు చేసేందుకు వీలుగా సహకరించాలని సీజేఐ కోరారు. ఈ కేసు విచారణ విషయంలో  తమ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
 

click me!