Punjab Elections: సింగర్‌ల వెంట పడ్డ పార్టీలు.. ఎందుకో తెలుసా?

By Mahesh KFirst Published Dec 15, 2021, 6:06 PM IST
Highlights

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సింగర్‌లపై ఫోకస్ పెట్టాయి. వీరిని పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చి బరిలోకి దింపనున్నారు. ఆప్ ఇప్పటికే పలువురు సింగర్లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. స్థానికంగా ప్రజల్లో విశేష ఆదరణ ఉండటం, రైతు ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించి మన్ననలు పొందడంతో వీరికి డిమాండ్ పెరిగింది. ఈ సారి ఓటర్లూ ఎక్కువ మంది యువకులే ఉండటమూ మరో కారణంగా ఉన్నది.

చండీగడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) రసవత్తరంగా సాగనున్నాయి. మూడు సాగు చట్టాల కారణంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే, రైతుల(Farmers)కు క్షమాపణలు చెబితే.. ఇచ్చిన మాట ప్రకారం, పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజేనే ఆ చట్టాలను రద్దు చేసే బిల్లును పాస్ చేశారు. దీంతో బీజేపీకి పంజాబ్‌లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ మూడు సాగు చట్టాల ఎపిసోడ్ కారణంగా పంజాబ్ ఎన్నికలపై దేశమంతా దృష్టి పెట్టనుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, మిగతా రాష్ట్రాల కంటే పంజాబ్‌లో పార్టీలు('Political Parties) భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కొత్తగా సింగర్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తూ టికెట్లు ఇస్తున్నాయి.

పంజాబ్ పాటలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఫోక్ సింగర్స్‌కు స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నది. అదీగాక, రైతు ఆందోళనల సమయంలో ఇక్కడ సింగర్‌లకు విశేష గుర్తింపు లభించింది. ఆందోళనలకు బీజం పడుతున్న తొలినాళ్లలో సింగర్‌లు కీలక పాత్ర పోషించారు. రైతుల ఉద్యమం తర్వాత కూడా వారి పట్ల ఉన్న ఆదరణ కొనసాగుతూనే ఉన్నది. తొలుత రైతు సంఘాలూ వారిని లక్ష్య పెట్టలేదు. కానీ, ఆ తర్వాత రైతులందరూ సింగర్‌లకు మద్దతు ఇచ్చారు. పంజాబ్‌లో వారికి ఇప్పుడు యమ క్రేజ్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు సింగర్‌లపైనా కాన్స‌ంట్రేషన్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు సింగర్‌లను పార్టీల్లో చేర్చుకోవడంతోపాటు.. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులుగానూ నిర్ణయించేసినట్టు తెలిసింది.

Also Read: ఢిల్లీ-యూపీ బార్డర్ లో రైతుల సంబరాలు..

మంగళవారం ఉదయం పంజాబీ ఫోక్ సింగర్ బూటా మహమ్మద్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో లూధియానాలో బీజేపీలో చేరాడు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌లో సర్దార్ అలీ చేరాడు. 31ఏళ్ల అన్మోల్ గగన్ మాన్ ఆప్‌లో చేరారు. ఆమె ఖరార్ నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేయడం ఖరారైపోయింది. మరో సింగర్ బల్కర్ సిద్దు కూడా ఆప్ టికెట్‌పై రాంపుర ఫుల్‌ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే, మరో సింగర్ బల్బీర్ చోటియానూ ఆప్ బటిండా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, సింగర్ సిద్దూ మూస్ వాలా కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయన లిరిక్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన చేతలూ వివాదాస్పదంగానే ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సొంత పార్టీ నుంచే ఆయనకు అక్కడక్కడా వ్యతిరేకత ఎదురవుతున్నది.

Also Read: హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు

రాజకీయ పార్టీలు సింగర్స్‌ను చేర్చుకుని వారిని ఎన్నికల బరిలోని నిలుపడానికి మరికొన్ని కారణాలూ ఉన్నాయి. 2017లో జరిగిన గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల డేటా ప్రకారం, రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్యనున్న ఓటర్లు 53 శాతం ఉన్నారు. పంజాబీ సింగర్స్ ఎక్కువగా వీరినే ముఖ్యంగా యువతనే ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. వీటికితోడు రాజకీయ పార్టీలు స్వతహాగా ఈ సింగర్‌లతో పార్టీలకు లబ్ది చేకూరుతుందనే అభిప్రాయాల్లో ఉన్నాయి. అందుకే పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇందులో సింగర్స్ ఎక్కువగా ఉన్నారు. కొన్ని పార్టీలు పాలీవుడ్‌(పంజాబ్ ఫిలిం ఇండస్ట్రీ) ప్రముఖులనూ చేర్చుకుంటున్నాయి.

click me!