ఆ రెడ్ లైట్ ఏరియాలో సీసీటీవీలు పెట్టడానికి సెక్స్ వర్కర్లకు, పోలీసులకు మధ్య అంగీకారం

By Mahesh KFirst Published Jan 6, 2023, 8:43 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పెద్ద రెడ్ లైట్ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీలు పెట్టడానికి పోలీసులు ప్రయత్నించగా సెక్స్ వర్కర్లు తిరస్కరించారు. ధర్నాకు దిగారు. దీంతో వారితో పలుమార్లు సమావేశమై వారిని ఒప్పించామని, మరో నెల రోజుల్లో ఇక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని పోలీసులు వివరించారు. సెక్స్ వర్కర్ల ప్రైవసీ, వారి క్లయింట్ల ప్రైవసీ రైట్లను ప్రస్తావిస్తూ వారు నిరసనలు చేశారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా. ఈ నగరంలో అతిపెద్ద రెడ్ లైట్ జిల్లా సోనాగచ్చి. ఈ సోనాగచ్చిలో 25 సీసీటీవీలు పెట్టడానికి పోలీసులకు, సెక్స్ వర్కర్లకు మధ్య అంగీకారం కుదిరింది. ముఖ్యంగా ఇవి లేన్‌లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో ఏర్పాటు చేయనున్నారు.

పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా వారికి సెక్స్ వర్కర్ల ధర్నా అడ్డం వచ్చింది. సెక్స్ వర్కర్లు, వారి క్లయింట్ల హక్కుల గురించి, వారి ప్రైవసీ గురించి మాట్లాడుతూ వారు ధర్నాకు దిగారు. దీంతో వారితో పోలీసులు పలు దశలుగా సమావేశాలు నిర్వహించారు. చివరకు ఇది సాధ్యం అయిందని బర్టోలా పోలీసులు తెలిపారు. సోనాగచ్చిలో సీసీటీవీలు ఏర్పాటు చేయడానికి తాము మెజార్టీ సెక్స్ వర్కర్ల నుంచి అనుమతి తీసుకున్నామని చెప్పారు.

స్థానిక వ్యాపారులతో ఒప్పందం కుదిరిందని, దాదాపు అన్ని సీసీటీవీ కెమెరాలకు ప్రైవేటుగానే పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో వారం రోజుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టే అవకాశాలు ఉన్నాయని గురువారం  వారు తెలిపారు. ఈ సీసీటీవీ కెమెరాల తమ భద్రతకు కూడా ఉపయోగపడతాయని కొందరు సెక్స్ వర్కర్లు అభిప్రాయపడ్డారు.

Also Read: దెయ్యం వదిలిస్తానని నమ్మించి మైనర్ బాలికపై మాంత్రికుడి అత్యాచారం.. యూపీలో ఘటన

కాగా, సెక్స్ వర్కర్ల పక్షాన నిలిచిన దర్బార్ మహిళ సమన్వయ మాత్రం పోలీసుల వాదనను తిరస్కరించింది. సెక్స్ వర్కర్లలో సీసీటీవీ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపింది. సెక్స్ వర్కర్ల తిరస్కరణకు ప్రధాన కారణంగా వారి ప్రైవసీ పై ప్రశ్నలు ఉన్నాయి. వారి క్లయింట్ల గోప్యత పైనా ప్రశ్నలు వేశారు. అయితే, ఇళ్ల ముందు సీసీటీవీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేయబోమని జాయింట్ కమిషనర్లు లాల్ బజార్‌లో తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

పోలీసులు మాట్లాడుతూ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో సెక్స్ వర్కర్లకూ భద్రత పెరుగుతుందని వివరించామని, ఇటీవలే వారిపై జరిగిన కొన్ని దాడులు, చైన్  స్నాచింగ్ ఘటనలనూ వారికి ఉదాహరణగా తెలిపామని పేర్కొన్నారు. అలాగే, వారి ఇళ్ల ముందు వీటిని ఏర్పాటు చేయబోమని, అయితే, వీధికి ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లలో మాత్రం ఏర్పాటు చేస్తామని వివరించి చెప్పామని అన్నారు.

కాగా, ఈ సీసీటీవీ కెమెరాలతో తమ కస్టమర్లను ప్రొఫైలింగ్ చేయడం సాధ్యం అవుతుందని, ఒక వేళ ఆ ఫుటేజీ దుర్వినియోగం అయితే.. దాని ద్వారా తమ కస్టమర్లనూ బెదిరించి డబ్బులు గుంజే ప్రమాదం లేకపోలేదని కొందరు సెక్స్ వర్కర్లు తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న ప్రతి మహిళ ఎలాంటి నేరాలకు పాల్పడరని, ఎందుకంటే అది వారి కస్టమర్ల సంఖ్యపై ప్రభావితం వేస్తుందని అన్నారు. సీసీటీవీ కెమెరాలను వీధి ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, స్కూల్ ఏరియాల్లో ఏర్పాటు చేస్తే తమకు పెద్దగా అభ్యంతరాలు ఉండవని సెక్స్ వర్కర్ల నుంచి మాట్లాడుతున్నారు.

click me!