థానేలో దారుణం: మంచినీళ్ల కోసం వచ్చి వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

By narsimha lodeFirst Published Nov 10, 2021, 10:05 AM IST
Highlights

మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకొంది. మహిళలపై  అత్యాచారాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 ముంబై:వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకొంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని సెక్యూరిటీ గార్డు ఆమెపై అత్యాచారం చేశాడు.  మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.థానేలోని నౌవడలోని హౌసింగ్ సోసైటీ వద్ద 25 ఏళ్ల యువకుడు  సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

మానసికంగా బాధపడుతున్న వృద్దురాలు ఈ సోసైటీలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను  చూసేందుకు బంధువులు వారంలో  రెండు దఫాలు వచ్చి పోతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ నెల 3వ తేదీన మంచినీళ్లు ఇవ్వాలని వృద్దురాలి ఇంట్లోకి వెళ్లాడు Security Guard. ఇంట్లోకి వెళ్లి ఆమె నీళ్లు తీసుకొచ్చేలోపుగా ఇంటి తలుపులు పెట్టి ఆమెపై Rapeకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన నాటి నుండి ఆమె తన ఇంట్లోనే బాధపడుతూ ఉంది. అయితే వృద్దురాలు బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమె బందువులకు సమాచారం ఇచ్చారు.

senior citizen బంధువులు వచ్చి ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించారు. ఈ పరీక్షలో అసలు విషయం వెలుగు చూసింది.  ఈ విషయమై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్యూరిటీ గార్డును విచారించారు. పోలీసుల విచారణలో సెక్యూరిటీ గార్డు తాను వృద్దురాలిపై అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకొన్నాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

also read:అత్యాచారం-హత్య కేసుల్లో మైనర్లకు మరణశిక్ష.. ! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !!

మానసికంగా ఇబ్బంది పడుతున్న వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోసైటీ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.  ఈ తరహా ఘటనలు  మరోసారి జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు.మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు జరగకుండా  పలు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ తరహా ఘటనలు ఆగడం లేదు.

నిర్భయ, దిశ లాంటి ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో నిరసనల సమయంలో ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఈ తరహా ఘటనలు జరగకుండా చూస్తామని హమీలు ఇస్తున్నారు. కానీ ఆచరణలో అమలు కావడం లేదు. మరో వైపు అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఆరు మాసాల్లోపుగానే కఠినమైన శిక్షలు పడితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవనే అభిప్రాయాలను మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. చట్టాలు చేయడమే కాదు ఆ చట్టాలను  అమలు చేయాల్సిన అవసరం ఉందనే  మహిళా సంఘాల నేతలు  కోరుతున్నారు.
 

click me!