రాత్రిళ్లు తలుపు తడుతున్న నగ్న మహిళ.. భయంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.. ఆమె గురించి అధికారులు ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Feb 5, 2023, 6:30 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మిలాక్ అనే గ్రామంలో ఓ మహిళ రాత్రిళ్లు నగ్నంగా తిరుగుతూ స్థానికుల ఇళ్ల తలుపులు తడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన స్థానికుల్లోనూ కలకలం రేగింది. వారు భయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకు వారు కొన్ని కీలక సూచనలు చేశారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో కొన్ని రోజులుగా కలకలం రేగుతున్నది. రాత్రిళ్లు ఓ నగ్న మహిళ తమ ఇంటి తలుపు తట్టి మాయమైపోతున్నది. రాంపూర్‌లోని మిలాక్ గ్రామంలో ఈ ఘటనలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట ఓ నగ్న మహిళ తమ ఇంటి తలుపులను తట్టి వెళ్లిపోతున్న ఓ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం, స్థానికుల్లో భయాలు నెలకొన్నాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి తమకు ఎదురవుతున్న అనుభవాలను వివరించారు. తమకు రక్షణ ఇవ్వాలని కోరారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేసి తాజాగా కొన్ని సూచనలను ఆ గ్రామ నివాసులకు చేశారు.

ఆ నగ్న మహిళ గురించి భయపడొద్దని, ఆమె మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు వివరించారు. గత ఐదేళ్లుగా ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నదని తెలిపారు. కాబట్టి, అనవసరంగా భయపడొద్దని పేర్కొన్నారు. ఇతరులనూ భయాందోళనలకు గురిచేయ వద్దని సూచనలు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇట్టి విషయంపై వదంతులు వ్యాప్తి చేయరాదని తెలిపారు.

స్థానికులు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. మిలాక్ గ్రామంలోని తమ ఇళ్ల తలుపులను ఆమె కొడుతున్నదని ఆరోపించారు. ఆ తర్వాత అదే రాత్రిలో మాయమైపోతున్నదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

Also Read: కశ్మీర్ సమస్యను పరిష్కరించాలనుకున్న ఏకైక పాకిస్తాన్ జనరల్: ముషారఫ్‌కు కశ్మీర్ లీడర్ మెహబూబా ముఫ్తీ నివాళి

‘మిలాక్ గ్రామంలో ఓ నగ్న మహిళ రాత్రిళ్లు తిరుగుతున్నదనే మిస్టరీ ఇప్పుడు తేటతెల్లమైంది. ఆ నగ్న మహిళ తల్లిదండ్రులు తమ బిడ్డకు మానసిక సమస్యలు ఉన్నట్టు చెప్పారు. బరేలీ జిల్లాలో గత ఐదేళ్లుగా ఆమెకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు’ అని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఆ మహిళపై ఎప్పుడూ నిఘా వేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించినట్టు వివరించారు. కాబట్టి, ఆ మహిళకు సంబంధించి లేదా, ఆ ఘటనలకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు వ్యాపింపజేయవద్దని స్థానికులకు సూచించారు. తద్వార ప్రజల్లో భయాందోళనలు కలిగించరాదని, అలాగే, ఆ మహిళ గౌరవానికి భంగం కలిగేలా చేయరాదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ మహిళ ఎవరికీ హానీ తలపెట్టలేదని, అలాగే, ఎవరూ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని పోలీసులు తెలిపారు.

click me!