మోడలింగ్ లో అవకాశాలంటూ.. యువతుల నగ్న ఫొటోలు, వీడియోలతో...

By SumaBala BukkaFirst Published Jan 13, 2022, 12:16 PM IST
Highlights

.మోడలింగ్ పై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్న ఫోటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందేవాడు.అతని మొబైల్ ని పరిశీలించగా వెయ్యికి పైగా యువతుల ప్రైవేట్ ఫోటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగుచూశాయి అని డీసీపీ శరణప్ప తెలిపారు. 


బెంగళూరు : modelingలో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల Nude photos, videoలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు arrest చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు ప్రపంచన్ ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. Social mediaల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మోడలింగ్ పై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్న ఫోటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందేవాడు.

అతని మొబైల్ ని పరిశీలించగా వెయ్యికి పైగా యువతుల ప్రైవేట్ ఫోటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగుచూశాయి అని డీసీపీ శరణప్ప తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి కేసే నిరుడు డిసెంబర్ లో ఒకటి తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. Instagram లో యువతులను మోసం చేస్తున్న అజయ్ అనే యువకుడిని పోలీసులు డిసెంబర్ 24న అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో యువతి Profile photoతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడినట్టు తేలింది. యువకుడిని అమ్మాయిగా భావించిన యువతులు వారి ఫొటోలను పంపించారు. 

వారి Nude pictures పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని... కోరిక తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని threatsకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్ పై సైబర్ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్ సుఖ్ నగర్ లో అజయ్ ని అరెస్ట్ చేశారు. 

నిందితుడు అజయ్ వరంగల్ జిల్లా పరకాల వాసిగా పోలీసులు గుర్తించారు. అజయ్ హైదరాబాద్ లో మల్టీ మీడియా కోర్సు చేస్తున్నాడు. అజయ్ ఇప్పటివరకు చాలామంది యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 

కాగా, ఓ వివాహితకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన నిరుడు డిసెంబర్ లో జరిగింది. కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన  married womanను అదే ప్రాంతంలోని తాళ్లూరుకు చెందిన సిహెచ్ ఏడుకొండలు కొంతకాలంగా sexual harassment చేస్తున్నాడు.  ఆమె భర్తకు ఫోన్ చేసి ఆమెను తన వద్దకు పంపాలంటూ బెదిరించాడు.  అతడి వేధింపులు తట్టుకోలేక గత నెల 28వ తేదీన ఆమె కనిగిరి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. 

అయినా చర్యలు లేకపోవడంతో.. ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అయినా చర్యలు లేకపోవడంతో ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అక్కడినుంచి కనిగిరి చేరుకుని తల్లితో కలిసి ఆమె నడిచి వస్తుండగా స్థానిక పామూరు బస్టాండ్ సమీపంలో ఏడుకొండలు అడ్డుకున్నాడు.

‘నా పైన కేసు పెడతారా’ అంటూ రక్తం వచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. ‘కుటుంబాన్ని ఊళ్ళో లేకుండా చేస్తా.. నీ భర్తను తరిమేస్తా’ అని తీవ్రంగా హెచ్చరించాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దాడి కేసు నమోదు చేసుకున్నారు.

click me!