Sam Pitroda: ‘సంపద స్వాధీనం’పై శామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. చిక్కులో కాంగ్రెస్

By Rajesh Karampoori  |  First Published Apr 24, 2024, 12:36 PM IST

Sam Pitroda: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు  శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  సంపద పంపిణీపై సామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 


Sam Pitroda: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు  శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  సంపద పంపిణీపై సామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇంతకీ ఏమన్నారంటే..
 
‘సంపద స్వాధీనం’పై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా  అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. "అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఎవరికైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటే.. అతను చనిపోయినప్పుడు అతను తన పిల్లలకు 45 శాతం మాత్రమే బదిలీ అవుతుంది" అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. "55 శాతం ఆస్తిని ప్రభుత్వమే లాక్కుంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు సంపదను సృష్టించి, ఇప్పుడు మీరు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం. ఇదే న్యాయమైన చట్టం." అని పేర్కొన్నారు. 

Latest Videos

పిట్రోడాపై అమిత్ షా  ఫైర్

శామ్ పిట్రోడా ప్రకటనపై బీజేపీ  విరుచుకుపడుతోంది. ప్రజల వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వ ఖజానాలో వేసి మైనారిటీలకు పంచాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని సామ్ స్పష్టం చేశారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.  తాజాగా శాం పిట్రోడా ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బట్టపడిందని అన్నారు. తమ మేనిఫెస్టోను తయారు చేయడంలో శామ్ పిట్రోడా కీలక పాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ నేత శాం పిట్రోడా చేసిన ప్రకటన కాంగ్రెస్ లక్ష్యాన్ని దేశం ముందు స్పష్టం చేసిందని అమిత్ షా అన్నారు. ప్రజల ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వ ఖజానాలో వేసి మైనారిటీలకు పంచాలని కాంగ్రెస్ లక్ష్యాన్ని సామ్ స్పష్టం చేశారు. దేశ ప్రజల వ్యక్తిగత ఆస్తులపై సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల్లో ఉంచాలని, యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయం మేరకు పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో నుండి దానిని ఉపసంహరించుకోవాలి లేదా ఇది వారి ఉద్దేశం అని అంగీకరించాలి... ప్రజలు శామ్ పిట్రోడా ప్రకటనను సీరియస్‌గా తీసుకోవాలని తాను కోరుకుంటున్నాననీ, వారి ఉద్దేశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయని, కాంగ్రెస్ భావాలను ప్రజలు గుర్తించాలని అమిత్ షా పేర్కొన్నారు. 

బీజేపీ నేతల అభ్యంతరం  

శామ్ పిట్రోడా చేసిన ఈ ప్రకటనపై బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శామ్ పిట్రోడా సంపద పంపిణీ కోసం 50 శాతం వారసత్వ పన్నును సమర్థించారు (భారతదేశంలో వారసత్వపు పన్ను)  . అంటే మన కష్టార్జితం, సంస్థతో మనం ఏది సృష్టించినా.. అది తీసివేయబడుతుంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ గెలిస్తే, మనం చెల్లించే పన్నులు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

ప్రధాని మోదీని ప్రియాంక గాంధీ టార్గెట్ 

ప్రధాని మోదీ ఆస్తుల పంపకాల ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా మీ మంగళసూత్రం, బంగారం లాక్కోవాలని కాంగ్రెస్ వాళ్లు అనడం మొదలైందని, ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు.. అందులో  55 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సాగింది. మీ బంగారం ఎవరైనా లాక్కున్నారా? మీ మంగళసూత్రం ప్రభుత్వం లాక్కుందా? దేశంలో యుద్ధం జరిగినప్పుడు.. ఇందిరాగాంధీ తన బంగారాన్ని దేశానికి ఇచ్చారు. ఈ దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం (రాజీవ్ గాంధీ) త్యాగం చేసిందని అన్నారు.

ప్రధాని మోదీ కౌంటర్

రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఎక్కువ మంది పిల్లలు, చొరబాటుదారులకు వాటిని పంచుతుందని అన్నారు. ఇంతకుముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. దేశ ఆస్తిపై ముస్లింలకే మొదటి హక్కు కాంగ్రెస్ ప్రకటించదని పేర్కొన్నారు. అంటే ఆస్తిని సేకరించిన తర్వాత, వారు దానిని ఎవరికి పంచుతారు? ఎక్కువ ఉన్నవారికి పంచుతారు. లేదా చొరబాటుదారులకు పంచిపెడతారా? అని ప్రశ్నించారు. 

ప్రధాని మోడీ ఇంకా మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమ్మానాన్నల బంగారాన్ని లెక్కిస్తామని చెబుతోందని.. దాని గురించి సమాచారం తీసుకుని ఆపై పంచుతామని.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎవరికి చెప్పారో వారికి పంచుతామని అన్నారు. ఆస్తిపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని పేర్కొంటున్న ఆరోపించారు.

click me!