చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

By narsimha lodeFirst Published Aug 21, 2019, 10:38 PM IST
Highlights

: మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం రాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. గురువారం నాడు ఉదయం సీబీఐ కోర్టులో చిదంబరాన్ని హాజరుపర్చే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం రాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. గురువారం నాడు ఉదయం సీబీఐ కోర్టులో చిదంబరాన్ని హాజరుపర్చే అవకాశం ఉంది.

బుధవారం నాడు రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఇంటికి చేరుకొన్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు గంటపాటు ఇంటి వద్ద జరిగిన హైడ్రామా తర్వాత సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.

చిదంబరం ఇంట్లోకి ఆయన వ్యక్తిగత సిబ్బంది రాకుండా అడ్డుకొన్నారు. అయితే గోడదూకి చిదంబరం ఇంట్లోకి వెళ్లారు. చిదంబరం ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డుకొన్నారు. దీంతో సీబీఐ అధికారులు ఢిల్లీ పోలీసుల సహాయం తీసుకొన్నారు. 

సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించే సమయంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఆయనను సీబీఐ హెడ్‌క్వార్టర్స్ కు తరలించనున్నారు. గురువారం నాడు పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

click me!