Asaduddin Owaisi: పాకిస్థాన్ తీరుపై మ‌రోసారి ఫైర్ అయిన ఓవైసీ.. ఫేక్ ఫొటోపై స్పందిస్తూ

Published : May 27, 2025, 02:32 PM ISTUpdated : May 27, 2025, 02:35 PM IST
Asaduddin Owaisi: పాకిస్థాన్ తీరుపై మ‌రోసారి ఫైర్ అయిన ఓవైసీ.. ఫేక్ ఫొటోపై స్పందిస్తూ

సారాంశం

ఫేక్ చైనీస్ మిలిటరీ డ్రిల్ ఫోటో గురించి పాకిస్తాన్ ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. FATF గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్‌ను తిరిగి చేర్చాలని పిలుపునిచ్చారు.

పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ పాత చైనీస్ మిలిటరీ డ్రిల్ ఫోటోను భారత్‌పై విజయానికి రుజువుగా చూపించిన ఘటనపై ఆయన విమర్శలు గుప్పించారు. 

కువైట్‌లోని భారతీయ ప్రవాసులతో మాట్లాడుతూ.. దీనిని వింతైన, దిక్కుతోచని ప్రచార ప్రయత్నంగా అభివర్ణించారు ఓవైసీ. 

“నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి ఒక ఫోటో బహుమతిగా ఇచ్చారు... ఈ మూర్ఖులు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారు” అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

భారత్‌పై పాకిస్తాన్ దాడి చేసినట్లు చెబుతోన్న ఆ ఫొటో నిజానికి 2019 చైనీస్ మిలిటరీ విన్యాసంలో PHL-03 రాకెట్ లాంచర్ వ్యవస్థకు సంబంధించినదని ఆయన వెల్లడించారు. ఈ చిత్రం గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో కనిపించింది, దానికి భారత్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. 

“2019 చైనీస్ ఆర్మీ డ్రిల్ ఫోటోను భారత్‌పై విజయంగా చూపించారు. పాకిస్తాన్ ఇలాంటివే చేస్తుంది” అని ఓవైసీ ఎద్దేవా చేశారు. 

“కాపీ కొట్టాలంటే తెలివి ఉండాలి, వాళ్లకి అది కూడా లేదు” అని విమర్శించారు.

పాకిస్తాన్ చెప్పేది అబద్ధమని, దానిని నమ్మవద్దని ఆయన సూచించారు. 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !