Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని పాకిస్థాన్ యుద్ధ విమానాలతో రెచ్చిపోతోంది. జమ్ముతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడుల చేస్తోంది. మరోవైపు భారత్ పాక్ దాడులను గట్టిగా తిప్పి కొడుతోంది. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి.

10:02 AM (IST) May 09
పాకిస్తాన్ చేసిన దాడిని భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పుడు సరిహద్దులోనే కాదు ఆర్థికంగా, దౌత్యపరంగా కూడా పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే పాక్ కు అందే భారీ నిధులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.
పూర్తి కథనం చదవండి03:57 AM (IST) May 09
India Pakistan war: భారత్ బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కగిలివుంది. శత్రుదేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పనిపట్టడానికి. శత్రు దేశాలకు వణుకు పుట్టించే భారత్ వద్ద ఉన్న ఆ ఐదు క్షిపణులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
03:25 AM (IST) May 09
India Pakistan war: పాకిస్తాన్‌తో ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో S-400 క్షిపణి వ్యవస్థ చాలా మార్పు తెచ్చిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ అన్నారు.
పూర్తి కథనం చదవండి02:52 AM (IST) May 09
India Pakistan War: గురువారం పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేసింది. ప్రతిగా భారత సైన్యం కూడా పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై బాంబు దాడి చేసింది. దీంతో భారత్-పాక్ మధ్య దాదాపు యుద్ధం మొదలైంది. అయితే, భారత్-పాక్ యుద్ధంతో ఏం జరగబోతోంది? మోడీ జాతకంపై జ్యోతిష్యం ఏమంటోంది?
పూర్తి కథనం చదవండి02:45 AM (IST) May 09
undefined పూర్తి కథనం చదవండి
02:21 AM (IST) May 09
India Pakistan War: భారత సైన్యానికి ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మద్దతు ప్రకటించారు. ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. మన సైనికులను పోరాటం చూస్తే గర్వంగా ఉందని తెలిపారు.
పూర్తి కథనం చదవండి02:11 AM (IST) May 09
India Pakistan War: ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 కొనసాగింపు పై అనిశ్చితి నెలకొంది. ధర్మశాలలో మ్యాచ్ మధ్యలో నిలిపివేశారు. దీంతో ఐపీఎల్ జరుగుతుందా? లేదా మొత్తానికే రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి02:11 AM (IST) May 09
India Pakistan tension war: పాకిస్తాన్ క్షిపణి దాడులపై భారత్ స్పందనతో దేశవ్యాప్తంగా భద్రత పెంపుతో పాటు 24 విమానాశయాలు తాత్కాలికంగా మూసివేసింది. హైఅలర్ట్ ప్రకటించింది.
01:17 AM (IST) May 09
పాకిస్తాన్ ఉగ్ర దాడుల పరంపరలో మరో ఘట్టంగా జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబా, ఆర్‌ఎస్‌పురా, అర్ణియా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత భద్రతా బలగాలు పూర్తిగా అడ్డుకున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
01:17 AM (IST) May 09
India Pakistan: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో పేలుళ్ల మోత మోగుతోంది. ఈ క్రమంలోనే లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇండియా ఆపరేషన్ సింధూర్ అనంతరం ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు బంకర్లలోకి వెళ్లారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
01:16 AM (IST) May 09
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం అధిపతి జనరల్ అసీం మునీర్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
01:13 AM (IST) May 09
India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ కరాచీ, లాహోర్, సియాల్కోట్‌లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.