రేపు కేరళలోకి రుతుపవనాలు: భారీ వర్షాలకు ఛాన్స్

By narsimha lodeFirst Published Jun 7, 2019, 5:04 PM IST
Highlights

రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.

న్యూఢిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.

ఈ నెల 8వ తేదీన కేరళలోకి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. 9వ తేదీన కొల్లాం, అలప్పుళా జిల్లాలు, 10న, తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖాధికారులు  ఆదేశాలు జారీ చేశారు.

మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులపాటు ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. అయితే సాయంత్రం పూట మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారం చివరివరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని  అధికారులు ప్రకటించారు. 

click me!