మత్తు పదార్థాలు ఇచ్చి 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. ‘ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తాం’

By Mahesh KFirst Published May 16, 2022, 7:11 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మైనర్ బాలికకు మత్తు పదార్థాలు అందించి ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా తీసారు. గ్యాంగ్ రేప్ గురించి ఎవరికైనా చెబితే వీడియోను వైరల్ చేస్తామని దుండగులు హెచ్చరించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికకు మత్తు పదార్థాలు అందించి ఆపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన మే 8వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

డబ్బుల ఆశ చూపి ఆ బాలికపై దుండగులు సామూహిక లైంగికదాడి చేశారు. ఆ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురికి ఆ దుండగులు మత్తు పదార్థాలు అందించారని ఆరోపించింది. ఐదుగురు నిందితులు ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపింది. అయితే, ఆ ఐదుగురు దుండగులు బాధితురాలికి తెలిసినవారేనని తెలిసింది.

ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఎవరికి చెప్పవద్దని నిందితులు హెచ్చరించారు. ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. కానీ, ఒక రోజు ఆమె మర్మాంగాల్లో తీవ్ర నొప్పితో కుప్పకూలిపోయింది. దీంతో బాధితురాలి బాలికకు విషయం తెలియవచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ దుర్ఘటనకు సంబంధించి నిందితులు వీడియో కూడా తీసినట్టు తర్వాత తెలిసింది. ఒక వేళ సామూహిక అత్యాచారానికి సంబంధించి ఎవరికి చెప్పినా ఆ వీడియోను వైరల్ చేస్తామని వారు హెచ్చరించినట్టు సమాచారం. ఆ ఐదుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

గురువారం సాయంత్రం జార్ఖండ్ రాజధాని రాంచీ (ranchi) నగరంలో బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు కారులో ఆమెను అనుసరించారు. కొద్ది దూరం వెళ్లాక అడ్రస్​ చెప్పాలంటూ ఆమెను కోరారు... అనంతరం కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. రాతూ స్టేషన్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​ సమీపంలో కారులోనే అగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న డీఎస్​పీ అంకిత (dsp ankitha) .. అనుమానాస్పదంగా ఉన్న కారును గమనించారు. 

వెంటనే అక్కడికి వెళ్లి కారును తనిఖీ చేశారు. అందులో ఐదుగురు యువకులు అభ్యంతకర రీతిలో కనిపించటం, వారి మధ్యలో బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. దీంతో విషయం అర్ధం చేసుకున్న అంకిత.. వెంటనే ధుర్వ స్టేషన్​ ఇంఛార్జ్​ ప్రవీణ్ ఝాకు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని ఆదేశించారు. డీఎస్పీ ఆదేశంతో అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో ఐదుగురు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితుల్లో పలువురు వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులుగా గుర్తించామన్నారు.

click me!