సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకి ప్రమోషన్

By sivanagaprasad kodatiFirst Published Dec 19, 2018, 7:38 AM IST
Highlights

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న ఆయన హోదాను అదనపు డైరెక్టర్ స్థాయికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న ఆయన హోదాను అదనపు డైరెక్టర్ స్థాయికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య ఆధిపత్య పోరు తలెత్తడంతో దేశప్రజల్లో సీబీఐపై ఉన్న గౌరవం తగ్గింది. ఈ క్రమంలో తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రప్రభుత్వం గత అక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది.

1983లో ఓయూ నుంచి కెమిస్ట్రీలో పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం సివిల్ సర్వీసులపై ఆసక్తితో 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన ఒడిశా క్యాడర్‌లో సేవలందించారు.

సంబంధిత వార్తలు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

click me!