నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన అప్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

10:07 AM (IST) May 14
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపేలా పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. మాజీ మంత్రి కొడాలి నానిపై సొంత పార్టీ నాయకుడే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
పూర్తి కథనం చదవండి09:22 AM (IST) May 14
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేసారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి08:21 AM (IST) May 14
గూగుల్ తన జి లోగోని మార్చేసింది. గూగుల్ లోగో అందరి మనసులోనూ బలంగా నాటుకుపోయింది. మరి ఇప్పుడు హఠాత్తుగా గూగుల్ లోగోని ఎందుకు మార్చారు? కొత్త లోగో ఎలా ఉంది? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి08:11 AM (IST) May 14
ఉదయ్‌పూర్‌లోని మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులపై నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవలి ఘర్షణల్లో పాకిస్తాన్ టర్కిష్ డ్రోన్‌లను ఉపయోగించడంతో వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని వారు చెబుతున్నారు.
పూర్తి కథనం చదవండి08:07 AM (IST) May 14
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. మొదటి రోజు బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్‌పై తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
పూర్తి కథనం చదవండి08:04 AM (IST) May 14
భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని తానే చల్లబరిచినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు చెబుతోన్న విషయం తెలిసిందే. కాల్పులు ఆపకపోతే ఇరు దేశాలతో వ్యాపారాన్ని ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ట్రంప్. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఓ రేంజ్‌లో మండిపడుతోంది.
07:45 AM (IST) May 14
చదరంగం ఒక మంచి మైండ్ గేమ్. చాలా మంది ఈ ఆటను ఆడడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే ఓ దేశం మాత్రం చెస్ ను నిషేధించింది. ఇంతకీ చెస్ ను బ్యాన్ చేయడానికి అసలు కారణం ఏంటనేగా మీ సందేహం.
07:32 AM (IST) May 14
పాకిస్తాన్ భారతీయ హైకమిషన్ ఉద్యోగిని 'పర్సన నాన్ గ్రాటా'గా ప్రకటించి 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది. భారతదేశం పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బహిష్కరించిన తర్వాత ఈ చర్య తీసుకుంది.
పూర్తి కథనం చదవండి07:22 AM (IST) May 14
తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. వేంకటేశ్వర స్వామిని ఒక్క క్షణం చూడడం కోసం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చుకొని మరీ తిరుమలకు చేరుకుంటారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే సామాన్యులకు అది కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ తాజాగా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
06:58 AM (IST) May 14
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల్లో హరీష్ రావు ఒకరు. కేసీఆర్‌కు నమ్మిన బంటులా ఉంటూ అధినేత ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్న హరీష్‌పై నిత్యం ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. హరీష్ రావు వేరు కుంపటి పెట్టుకుంటారని, పార్టీ నుంచి బయటకు వస్తారని ఇలా రకరకాల వార్తలు వస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఇలాంటి వార్తలపై హరీష్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.
06:39 AM (IST) May 14
ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వాతావారణం ఒక్కసారిగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.