చట్టాన్ని ఉల్లంఘించేవారు పారిపోతున్నారా..?

By Siva KodatiFirst Published Sep 29, 2020, 9:14 PM IST
Highlights

చట్టం పరిశీలన కారణంగా అమ్నెస్టీ భారత్‌లో తన కార్యకలాపాలను తగ్గిస్తుండటం ఊహాజనితంగా కనిపిస్తోంది. అమ్నెస్టీ చర్య చట్టపరమైన ఉల్లంఘనలను కవర్ చేయడానికి ఒక తెరను సృష్టించడానికి ప్రయత్నించినట్లుగా ఉంది.

- రాజీవ్ చంద్రశేఖర్
రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి

చట్టం పరిశీలన కారణంగా అమ్నెస్టీ భారత్‌లో తన కార్యకలాపాలను తగ్గిస్తుండటం ఊహాజనితంగా కనిపిస్తోంది. అమ్నెస్టీ చర్య చట్టపరమైన ఉల్లంఘనలను కవర్ చేయడానికి ఒక తెరను సృష్టించడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు.. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తి తాను బాధితుడిని అన్న కార్డును వుపయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కేసు విషయానికి  వస్తే ప్రభుత్వాల చర్యలు, మరీ ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతికూలంగా నివేదికలు రావడాన్ని అమ్నెస్టీ తప్పుబడుతోంది. 

వీటి విషయంలో న్యాయస్థానాల ద్వారా బయటపడాలని చూసిన ఈ సంస్థ విఫలమైంది. భారతదేశం ప్రధానంగా చట్టాల మీదుగా నడిచే దేశం. నిధులను స్వీకరించేందుకు అన్ని విదేశీ ఎన్జీవోలు ఎఫ్‌సీఆర్ఏకే కట్టుబడి ఉండాలి. ఎఫ్‌సీఆర్ఏ 2010 ప్రకారం.. 2010 ప్రకారం విదేశీ నిధులను స్వీకరించేవారు తాము విదేశీ నిధులను దారి మళ్ళించలేదని, దేశ ద్రోహానికి ప్రేరేపించలేదని, హింసాత్మక మార్గాలను ప్రోత్సహించలేదని ప్రమాణపూర్వక అఫిడవిట్‌ను ధ్రువీకరించి, సమర్పించాలి. 

ఇదేదో కొత్తగా వచ్చిన నిబంధనలు కావు. భారతదేశంలో దశాబ్ధాలుగా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు భారతీయ చట్టానికి కట్టుబడి ఉండాల్సిన అవససరం లేదని భావించాయి. అమ్మెస్టీ విషయంలో కూడా అదే జరిగింది. అమ్నెస్టీ అడిగే ప్రశ్నలు తీవ్రమైనవి. సార్వభౌమ దేశంలో కార్యకలాపాలు సాగించే ఏదైనా విదేశీ సంస్థ గురించి ఖచ్చితంగా ప్రశ్నించడంతో పాటు చట్టానికి అనుగుణంగా విధులు సాగించాలని ఆశిస్తారు. అమ్మెస్టిస్ ఫైనాన్స్‌లు భారతదేశ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. 

2000 డిసెంబర్‌లో తొలిసారిగా అమ్నెస్టీకి ఒకే ఒక్కసారి ఎఫ్‌సీఆర్ఏ ఆమోదం లభించింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా రెన్యూవల్‌తో పాటు ఎఫ్‌సీఆర్ఏ ఆమోదాలను అమ్నెస్టీ పొందలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఎఫ్‌సీఆర్ఏ చాలా సార్లు తిరస్కరించింది. అయినప్పటికీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఏఐఎఫ్), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐఐపీఎల్), ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ (ఐఏఐటీ), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియా ఫౌండేషన్(ఏఐఎస్ఏఎఫ్) సంస్థలు విదేశాల నుంచి విరాళాలను స్వీకరిస్తూనే ఉన్నాయి. 

అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలకు ఎఫ్‌సీఆర్ఏ‌ ఉద్దేశించిన పరిశీలన, సమ్మతి నుంచి తప్పించుకునేలా వీటికి రూపకల్పన చేశారు. అమ్నెస్టీకి సంబంధించిన వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా హోం మంత్రిత్వ శాఖ నుంచి తిరస్కరణలు ఉన్నప్పటికీ, ఆ సంస్థ చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి నిధులను తరలిస్తోంది. యూపీఏ కాలం హయాం నుంచి దశాబ్ధకాలం నాటి కార్యకలాపాలపై పరిశీలనకు భయపడే అమ్నెస్టీ భారత్‌లో షట్‌డౌన్ ప్రకటించింది. ఇది ఏ ఇతర భారతీయ చట్టానికి లోబడి ప్రవర్తించలేదు.

ఫైనాన్సింగ్ సమస్యలకు మించి భారతదేశంలో అమ్నెస్టీకి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం గార్డియన్ వార్తాపత్రిక గీతా సహగల్‌ను సంప్రదించగా  ఫిబ్రవరి 2019 నివేదికలో పని చేసే ప్రదేశంలో బెదిరింపులు, బహిరంగ అవమానం, వివక్ష, అధికార దుర్వినియోగం గురించి వెల్లడించారు. కొన్నేళ్లుగా విభజన ఎజెండాను, హింసను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న వారు ఇటీవల సి‌ఏ‌ఏ(చీఫ్ అమెండ్మెంట్ యాక్ట్) వ్యతిరేక నిరసనలను ప్రేరేపించడంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. సి‌ఏ‌ఏ బిల్ ముస్లిం మతానికి వ్యతిరేకమని అంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడంలో ముందు నిలిచారు.  ప్రభుత్వ సభ్యులు, బిజెపి, బిజెపి మద్దతుదారులు, హిందూ మతం పై విశ్వాసం ఉన్నవారికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా దుర్మార్గమైన, ఆధారాలు లేని ఆరోపణలు, అబద్ధాలతో ద్వేషపూరిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 

అమ్నెస్టీ ఇతర దేశాలలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడంలో రికార్డు ఉంది. అమ్నెస్టీ ఎల్లప్పుడూ దేశాలను అణగదొక్కే రాజకీయ ఉద్దేశ్యంతో కూడిన సంస్థ. ఇది చాలా సంవత్సరాలు పాశ్చాత్య ప్రపంచం ప్రయోజనానికి ఉపయోగపడింది. తరువాత 2000 ప్రారంభంలో వామపక్షవాదులు, అరాచకవాదులు ఈ సంస్థను చేపట్టి ప్రాథమికంగా దాని వ్యూహాలను, లక్ష్యాలను మార్చారు. 2010లో నయనతారా సాగల్ కుమార్తె, జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు గీతా సహగల్ అమ్నెస్టీని విడిచిపెట్టారు.

ప్రస్తుతం అమ్నెస్టీ నాయకత్వం "సైద్ధాంతిక దివాలా", "మిజోజిని" తో బాధపడుతుందని ఆమె అభివర్ణించారు. భారతదేశంలో వామపక్ష, ఇస్లామిస్ట్ హింసకు మద్దతు ఇచ్చే నక్సలైట్స్, అరాచకవాదుల నుండి ఉగ్రవాదుల వరకు మద్దతు ఇచ్చే రికార్డు అమ్నెస్టీ కలిగి ఉంది. మానవ హక్కుల పేరిట సాయుధ దళాలకు వ్యతిరేకంగా దుర్మార్గపు ప్రచారం చేశారు.

ప్రభుత్వ విరమణతో సంబంధం లేకుండా భారతదేశంలో పనిచేస్తున్న ఇతర సంస్థలలాగానే అమ్నెస్టీ కూడా భారతీయ చట్టాన్ని గౌరవించాలి, పాటించాలి. మీరు భారతదేశంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. విదేశీ ఎన్జీఓగా ఉండటం భారతదేశంలో ఫ్రీ పాస్ కాదు.

click me!