కోచింగ్ నుంచి వస్తున్న 8వ తరగతి బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. నిందితులను అరెస్టు చేయాలని నిరసనలు

By team teluguFirst Published Jan 4, 2023, 8:58 AM IST
Highlights

బీహార్ లో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తున్న మైనర్ పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఓ ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు.

కోచింగ్ క్లాస్ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, 5 గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రెకెత్తించింది. నిందితులను అరెస్టు చేయాలని బీహార్ రాజధానిలో తీవ్ర నిరసనలు చెలరేగాయి.

బాబోయ్.. వాట్సప్ గ్రూపు నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు..

వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పాట్నాలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ లో క్లాస్ లు ముగించుకొని ఇంటికి మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటికి వస్తోంది. అయితే ఈ సమయంలో ఓ ఆటోలో పలువురు వ్యక్తులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం జల్లా ప్రాంతంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారని ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది.

జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన బాలీవుడ్ నటుడు.. తనదైన శైలిలో రిప్లే.. కట్ చేస్తే..

అనంతరం బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. దీంతో బాలిక స్పృహతప్పి పడిపోయింది. అనంతరం మైనర్ ను శని దేవాలయం సమీపంలో పడేసి వెళ్లిపోయారు. అయితే కొంతసేపటి తర్వాత బాలిక స్పృహలోకి రావడంతో వచ్చింది. తరువాత ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తనపై జరిగిన దాడిని వివరించింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. కోచ్‌ల అద్దాలు ధ్వంసం

తల్లిదండ్రులు బైపాస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గోలు కుమార్, ముఖేష్ కుమార్, ప్రమోద్ కుమార్, సుగ్రీవ్ కుమార్, ఆటోరిక్షా డ్రైవర్‌గా గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులను నిరసనలకు దిగారు. కాగా.. నిందితుల్లో నలుగురు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఆటో డ్రైవర్ ను మాత్రమే అరెస్టు చేశారు. 

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి.. వాహనాలను ధ్వంసం, దహనం

కాగా.. గతేడాది బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి ఐదుగురు వ్యక్తులు నెల రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. మహనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాధితురాలు నవంబర్ రెండో వారంలో జండాహా మార్కెట్‌కు వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిందితులు ఆమెను బలవంతంగా ట్రక్కులోకి లాగి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమెను ఒక నెలపాటు బందీగా ఉంచారు, అక్కడ వారు ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఐదుగురు నిందితులు ఢిల్లీలో ఒక నెల పాటు తనపై పదేపదే అత్యాచారం చేశారని, ఆపై తిరిగి వైశాలి వద్దకు తీసుకెళ్లి తన గ్రామ సమీపంలో వదిలిపెట్టారని మైనర్ పోలీసులకు తెలిపింది.
 

click me!