పోర్న్ సైట్స్ చూడటమే పని.. రాత్రిపూట కాల్‌ గర్ల్స్‌తో చాటింగ్.. ప్రశ్నించిన భార్యకు వేధింపులు.. చివరకు..

By team teluguFirst Published Nov 3, 2021, 4:28 PM IST
Highlights

ఓ వ్యక్తికి పోర్న్ సైట్స్ చూడటం వ్యసనంగా మారింది. అంతేకాకుండా రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో (call girls) చాట్ చేసేవాడు. అయితే ఇదేమిటని ప్రశ్నించిన పాపానికి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. 

ఓ వ్యక్తికి పోర్న్ సైట్స్ చూడటం వ్యసనంగా మారింది. అంతేకాకుండా రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో (call girls) చాట్ చేసేవాడు. అయితే ఇదేమిటని ప్రశ్నించిన పాపానికి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అనంతరం కోర్టు సూచనలతో పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) చోటుచేసుకుంది. వివరాలు.. జయనగరకు చెందిన 36 ఏళ్ల మహిళకు 2019 నవంబర్ 11న నిందితుడితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మహిళ కుటుంబ సభ్యులు కట్నంగా రూ. 2 లక్షల నగదు, లక్ష విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు.

Also read: కొడుకు లేని టైం చూసి.. కోడలి గదిలో దూరి మామ అఘాయిత్యం...

అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే తన భర్త పోర్న్ సైట్లు చూసే అలవాటు ఉందని, అది వ్యసనంగా మారిందని మహిళ తెలుసుకుంది. అతడి వ్యసనాలపై మహిళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతడిని మందలించారు. అయితే ఈ సందర్భంగా తనను తాను సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని నిందితుడు మహిళను కోరాడు. 

అయినప్పటికీ అతని తన ప్రవర్తన మార్చుకోలేదు. మహిళ కూడా పద్దతి మార్చుకోవాలని అతని చెప్పిచూసింది. అయితే రోజురోజుకు అతని వ్యసనాలు దారుణంగా మారాయి. పోర్న్ సైట్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసి అర్దరాత్రి కాల్ గర్ల్స్‌తో చాట్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం భారీగా డబ్బు కూడా ఖర్చు చేసేవాడు. ఇదేమిటని మహిళ అతడిని ప్రశ్నించింది. భార్య అలా ప్రశ్నించేసరికి నిందితుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తాను విడాకులు తీసుకున్నానని.. మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా మ్యాట్రిమోనియల్ సైట్‌లో నిందితుడు అతని ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు.

Also read: ఐదేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు లైంగి దాడి...

భర్త వేధింపులు, అతని చర్యలతో విసుగు చెందిన మహిళ కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ క్రమంలోనే సోమవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బాధితురాలు ఫిర్యాదుపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో బసవన్‌గుడి మహిళా పోలీసులు..  మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై వరకట్న వేధింపులు, గృహా హింస, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

click me!