నేడు సుప్రీంకోర్టు సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఏమిటీ ఆయన నేపథ్యం.. ?

By team teluguFirst Published Nov 9, 2022, 4:44 AM IST
Highlights

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ డీవై చంద్రచూడ్ నేడు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత సీజేఐ యుయు లలిత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. నేటి నుంచి 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత సుధీర్ఘ కాలం పాటు ఎవరూ సీజేఐగా వ్యవహరించలేదు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కోవిడ్-19 పాజిటివ్..

కాగా.. గతంలో అత్యధిక కాలం పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడైన డీవై చంద్రచూడ్ 1959 నవంబర్ 11వ తేదీన జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆయన 1986 లో హార్వర్డ్ నుండి డాక్టర్ ఆఫ్ జ్యూరిడిషియల్ సైన్సెస్ (ఎస్జేడీ) డిగ్రీని పొందాడు.

జస్టిస్ చంద్రచూడ్ 1998 నుండి 2000 వరకు భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1998లో బాంబే హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, బాండెడ్ మహిళా కార్మికుల హక్కులు, పని ప్రదేశంలో హెచ్ఐవీ పాజిటివ్ వర్కర్ల హక్కులు, కాంట్రాక్ట్ లేబర్, మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల హక్కులతో సంబంధం ఉన్న అనేక ముఖ్యమైన కేసులను ఆయన వాదించారు.

హైవేపై చెడిపోయిన బస్సు.. కాన్వాయ్ నుంచి దిగి నెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. వీడియో వైరల్ 

2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన చంద్రచూడ్ 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు అక్కడే పనిచేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి లభించింది. 

ఇక అప్పటి నుండి ఆయన పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు అనేక ముఖ్యమైన కేసుల్లో తీర్పులను వెలువరించారు. ఆధార్ చట్టాన్ని ద్రవ్య బిల్లుగా ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో అసమ్మతి వ్యక్తం చేసిన ఏకైక న్యాయమూర్తి ఆయనే.

బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం.. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు

జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన కొనసాగిన సుప్రీంకోర్టు ఇ-కోర్ట్ కమిటీ భారతదేశంలో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మౌలిక సదుపాయాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారితో విచారణలు తీవ్రంగా ప్రభావితమైన సమయంలో ఇది చాలా ప్రముఖంగా ఉపయోగపడింది.

కర్ణాటకలో మత ఘర్షణ.. శృంగేరిలో మసీదు ఎదుట వెలిసిన కాషాయ జెండాలే కారణం.. 

కాగా.. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ న్యాయ నియామక ప్రక్రియ, పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం, దేశవ్యాప్తంగా న్యాయ పంపిణీ ప్రమాణాలను మెరుగుపరచడం వరకు వంటి అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు.
 

click me!