JK Man Returns to India: ఓ చిన్న పొర‌పాటు.. 29 ఏండ్ల జైలు శిక్ష‌..

Published : Dec 28, 2021, 09:47 PM IST
JK Man Returns to India:   ఓ చిన్న పొర‌పాటు.. 29 ఏండ్ల జైలు శిక్ష‌..

సారాంశం

 పొరపాటున ఓ భార‌తీయుడు.. సరిహద్దు దాటాడు. దీంతో దాదాపు 29 ఏళ్లు పాకిస్థాన్​ జైలులో మ‌గ్గాడు ఓ భారతీయుడు.. ఎట్టకేలకు స్వదేశానికి తిరిగివచ్చాడు. డిసెంబర్​ 24న రాత్రి జమ్ముకశ్మీర్​ కథువాలోని తన స్వగ్రామం ముక్వాల్​కు చేరుకున్న కుల్​దీప్​ సింగ్.. ఘనస్వాగతం అందుకున్నాడు. అక్కడికి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు భారీగా చేరుకున్నారు

JK Man Returns to India:  చిన్న పొర‌పాటు ఓ వ్య‌క్తి జీవితాన్ని మార్చివేసింది. అనుకుండా ఓ రోజు దేశ స‌రిహ‌ద్దు దాటాడు. దీంతో ఊహించిన కష్టాల్లో ప‌డ్డాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లు జైలులో మ‌గ్గాడు. నిత్యం న‌ర‌కం అనుభ‌వించాడు. ఎట్టకేలకు స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ పరిస్థితి జమ్మూ కాశ్మీర్‌ కథువాలోని తన స్వగ్రామం ముక్వాల్ నివాసి​ కుల్​దీప్​ సింగ్ కు ఎదురైంది.  
 
వివ‌రాల్లోకెళ్తే.. కతువా జిల్లా.. బిల్లావర్‌లోని మక్వాల్‌కు చెందిన కుల్దీప్ సింగ్ 1992 డిసెంబర్​లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి..  పాకిస్థాన్ లోకి ఏంట్రీ అయ్యారు.  దీంతో కుల్​దీప్​ను పాకిస్థాన్​ సైన్యం అరెస్టు చేసింది. దీంతో ఊహించిన కష్టాల్లో ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న  గూఢచారి కేసులో నాలుగు ఏండ్ల పాటు పాకిస్తాన్ కోర్టులో విచారణలను ఎదుర్కొన్నాడు. ఈ క్ర‌మంలో శిక్ష ఖ‌రారు కావ‌డంతో 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. ఇన్నేళ్లు  పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో 29 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభ‌వించారు. నిత్యం ప్ర‌త్యేక్ష న‌ర‌కం చవిచూశాడు.

Read Also: డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదు: కరోనా బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ

ఉత్తర ప్రత్యుత్తరాలు, భారత హైకమిషన్ న్యాయ పోరాటం తర్వాత, సింగ్ జైలు నుండి విడుదలై డిసెంబర్ 20న అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చాడు. 24న తన స్వగ్రామానికి వచ్చాడు. ఆయ‌న రాకతో..వారి కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి.
 కుటుంబంతో మళ్లీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు​. ఆనందంతో స్వీట్లు పంచుతున్న కుల్​దీప్​ సింగ్​భారతీయులను అక్కడ ఎలా హింసిస్తున్నారో వివరించాడు కుల్​దీప్​.

Read Also: 9 నెలలు దాటిన తర్వాతే ప్రికాషన్ డోస్.. పిల్లలకు జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్.. ఎలా నమోదు చేసుకోవాలంటే..

ఈ క్ర‌మంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఆర్మీ వలలో పడిన ప్రతి భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తారని, హైవోల్టేజీ టార్చెస్‌తో పాటు కఠిన కారాగార శిక్షకు గురవుతారని, తనను కూడా బాగా ఇబ్బందిపెట్టారని సింగ్ అన్నారు. తాను ఎప్పుడూ ఆశ వదలలేదనీ, పాక్ ఆర్మీ వలలో చిక్కుకున్న ప్ర‌తి భారతీయుడిని గూఢచారిగా భావించి చిత్రహింసలకు గురిచేస్తార‌నీ,  కఠిన కారాగార శిక్ష విధించారని, క‌నీస మానవత్వం కూడా  చూపలేదని సింగ్ అన్నారు. తాను కొత్త జీవితాన్ని పొందానని, తన కుటుంబంతో మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉందని సింగ్ చెప్పాడు.

Read Also: కాబోయే అల్లుడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. మాములుగా లేదుగా..

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన చాలా మంది వ్యక్తులు నేటీకి పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నారని, 10 నుండి 12 మంది భారతీయులు పాకిస్తాన్‌లోని మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, భద్రతా సంస్థలచే దారుణంగా హింసించబడ్డారని తెలిపారు. బాధితుల‌పై క‌నీస మానవత్వం చూపించి..  మ‌న దేశ ఖైదీలందరినీ విడుదల చేయాలని, ఈ మేర‌కు భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలకు సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కుల్దీప్ సింగ్ భార్య ఊర్మిళ మాట్లాడుతూ.. 29 ఏళ్ల తర్వాత తన భర్త తిరిగి రావడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, త‌మ కుటుంబానికి పెద్ద పండుగ అని, అతనికి, త‌మ‌ కుటుంబానికి ఇది కొత్త జన్మ అని ఆమె అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్