
న్యూఢిల్లీ: 60 ఏళ్లు దాటిన వారికి కరోనా బూస్టర్ డోస్ ను అందించేందుకు డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకొన్నారు. బూస్టర్ డోస్ తీసుకొనే సమయంలో 60 ఏళ్లు దాటిన వారంతా డాక్టర్ ను సంప్రదించాలని ఈ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే Booster Dose ను ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తొలుత ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో పాటు 15 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా Corona Vaccine ఇవ్వాలని కూడ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవలనే జాతినిుద్దేశించి ప్రధాని Narendra Modi ప్రసంగించారు.ఈ సందర్భంగా మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. రెండో డోస్ తీసుకొన్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి Rakesh Bhushan చెప్పారు. రెండో డోస్ తీసుకున్న తేదీ నుండి 39 వారాలు దాటిన తర్వాత బూస్టర్ డోస్ అందిస్తామని కేంద్రం తెలిపింది.
ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు వచ్చే ఏడాది జనవరి నుండి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను అందించనున్నారు.60 ఏళ్లు దాటిన వారంతా బూస్టర్ డోస్ కోసం కోవిన్ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్రం కోరింది.15 ఏళ్ల నుండి 18 ఏళ్ల మధ్య పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విషయమై కూడా కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ చేసింది.
భారత్‌లో పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్, జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు మాత్రమే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ టీకాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. అయితే 12 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక, జైకోవ్-డి వ్యాక్సిన్ విషయానికి వస్తే మూడు డోసుల్లో దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకాలో సిరంజిలు ఉపయోగించరు.