రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్ప‌డితే వదిలేయండి.. త‌ప్పేకాదు.. BJP MP సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Dec 28, 2021, 04:52 PM IST
రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్ప‌డితే వదిలేయండి.. త‌ప్పేకాదు..  BJP MP సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

రూ.15 లక్షలలోపు లంచం తీసుకుంటే.. అది పెద్ద విషయం కాదనీ, అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దని BJP MP జనార్దన్‌ మిశ్రా ప్రజలకు చెప్పారు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్ లో జ‌రిగింది.    

BJP MP Janaradan Mishra controversial statement:  ప్ర‌జ‌లకోసం ప‌నిచేసే అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు గానీ.. ఎవరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నా, అవినీతికి పాల్పడిన నేర‌మే. అలాంటి త‌ప్పుడు పనుల‌ను ఎవ్వ‌రూ ప్రోత్స‌హించ కూడ‌దు. అలాంటివి మీ కంట‌ప‌డితే..  మా దృష్టికి తీసుక‌రండి. వారి పనిపడతాం అంటారు ఉన్న‌తాధికారులు, ప్ర‌భుత్వం పెద్ద‌లు. కానీ,  ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. ఏకంగా ఓ ఎంపీ నే రంగంలోకి దిగి.. త‌క్కువ మొత్తంలో లంచం తీసుకుంటే త‌ప్పే కాద‌ని, వాటిని చూసి చూడ‌న‌ట్టు వ‌దిలివేయాలని,  ఓ టార్గెల్ ఫిక్స్ చేసి.. అంత‌కంటే.. ఎక్కువ మొత్తంలో లంచం తీసుకుంటే.. త‌న వ‌ద్ద‌కు రావాల‌ని, ఆ ఫలానా లోపైతే తప్పేమీ లేదని ప్ర‌జ‌ల‌ను హిత బోధ చేశాడు. ఈ  ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ సమావేశం జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని రేవాలో జ‌రిగిన స‌మావేశంలో బీజేపీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ జనార్దన్‌ మిశ్రా మాట్లాడుతూ..లంచం (అవినీతికి పాల్పడినా) ఎంత తీసుకోవచ్చు.. ఎంత తీసుకోకూడదో ఓ క్లార‌టీ ఇచ్చాడు.  ‘మీ గ్రామ సర్పంచ్‌ రూ.15 లక్షలు గానీ..అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. రూ.15 లక్షలలోపు లంచం తీసుకుంటే అది పెద్ద విషయం కాదు. నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి. అంతకంటే ఎక్కువ లంచం అడిగితేనే తప్పు. అని చెప్పుకొచ్చారు. 

Read Also : Ys Vivekananda Reddy Murder case: కొందరు బెదిరిస్తున్నారు... కోర్టులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్

సర్పంచ్ కు ఎందుకు లంచం ఇవ్వాలో కూడా క్లారిటీగా చెప్పుకోచ్చాడు.  సదరు ప్రెసిడెంట్ ఎన్నికల్లో   గెలువ‌డానికి రూ.7 లక్షలు ఖర్చు చేశాడు. మరోసారి గెలవాలంటే మరో రూ.7 లక్షలు అవసరమవుతాయి. ఇంకో లక్ష అంటారా దానికి అదనం. అందులో తప్పేమీ లేదు. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడితే ఆ సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటాం’ అంటూ చాలా క్లీయ‌ర్ గా చెప్పుకోచ్చాడు. 

Read Also :  Yellow alert in Delhi: ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. సినిమా హాళ్లు, స్కూల్స్ మూసివేత.. వాటికి మాత్రమే అనుమతి..

ప‌రోక్షంగా..ప్రజలు తమకు పనులు కావాలంటే.. స‌ర్పంచ్ జేబు నింపాల‌ని చెప్ప‌క‌నే చెప్పేశాడన్నమాట.. ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి పాల్పడొద్దని, ప్రజలకు సేవ చేయాలని చెప్పాల్సిన ఎంపీ.. ఫలానా మొత్తం వరకు తీసుకుంటే లంచం లేదా అవినీతికి పాల్పడినట్లు చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ప్ర‌స్తుతం బీజేపీ ఎంపీ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్