Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో 'నరేంద్ర మోదీ'యూట్యూబ్ ఛానెల్ ఆల్ టైం రికార్డు.. జయలలిత ఆభరణాలపై బెంగళూర్ కోర్టు సంచలన తీర్పు, బీహార్ మాజీ సీఎంకు భారతరత్న , గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం, ఐదో జాబితాపై వైఎస్ఆర్‌సీపీ కసరత్తు, మనోళ్లే ఆరుగురు..మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించిన ఐసీసీ, డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?, ఈ ఏడాది ఆస్కార్ కోసం పోటీ పడుతోన్న చిత్రాలివే.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. వంటి వార్తల సమాహారం.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Today Top Stories: 'నరేంద్ర మోదీ' యూట్యూబ్ ఛానెల్ ఆల్ టైం రికార్డు..
Narendra Modi: అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ కూడా ఓ రికార్డును బద్దలు కొట్టింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన యూట్యూబ్ ఛానెల్‌గా నరేంద్ర మోడీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను నరేంద్ర మోదీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ప్రధాని యూట్యూబ్ ఛానెల్.. లైవ్ స్ట్రీమ్ వీక్షణల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
జయలలిత ఆభరణాలపై బెంగళూర్ కోర్టు సంచలన తీర్పు !!
Jayalalitha: తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంగారు, వజ్రాభరణాలపై హక్కులకు సంబంధించి కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జయలలిత బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దీని తర్వాత.. ఇప్పుడు ఈ ఆభరణాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనుంది.
బీహార్ మాజీ సీఎం , దివంగత కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన శతజయంతి సందర్భంగా ఈ ప్రకటన రావడం గమనార్హం. 1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరిగ్రామ్‌లో జన్మించిన ఠాకూర్.. జీవితాంతం పేద ప్రజల పక్షాన నిలిచారు. వారి అభ్యున్నతి, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బీహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి ‘‘జన నాయక్’’గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు..
అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ వేడుకను దేశ, విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ, సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరుతో పిలవనున్నారు.
త్వరలో పట్టాలెక్కనున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్..
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత" పేరుతో అన్ని భారతీయ భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులైన సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్' బ్యానర్‌పై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది ఆస్కార్ కోసం పోటీ పడుతోన్న చిత్రాలివే..
Oscar nominations 2024: 2024 ఆస్కార్ అవార్డులకు సంబంధించి నామినేషన్స్‌ను అకాడమీ ప్రకటించింది. గత 12 నెలల నుంచి చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటీనటులు, సినిమాలను ఆస్కార్ కమిటీ గౌరవించనుంది. కాగా.. మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరిగే కార్యక్రమంలో 96వ అకాడమీ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే.. వారి కలయిక తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినా నేతలేవరు? ఇంతకీ ఏం చర్చించారు.
గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం..
రాజ్యసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు.
ఐదో జాబితాపై వైఎస్ఆర్‌సీపీ కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పు విషయంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది. ఐదో జాబితా కోసం వైఎస్ఆర్‌సీపీ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే నాలుగు విడతలుగా 10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేలను మార్చింది వైఎస్ఆర్‌సీపీ. ఇంకా మరికొందరిని మార్చేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.
మనోళ్లే ఆరుగురు..మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించిన ఐసీసీ
ICC ODI Team of the year 2023: ICC ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇది కాకుండా.. విరాట్ కోహ్లీతో సహా మొత్తం 6 మంది భారత ఆటగాళ్లు ఐసిసి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది.
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
WPL 2024: మహిళ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024) సీజన్-2 షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే.. ఈసారి పెద్ద మార్పు కనిపించింది. గత ఏడాది ఈ లీగ్‌ను ముంబై , నవీ ముంబైలోని రెండు స్టేడియంలలో ఆడారు. అయితే.. ఈసారి ఈ లీగ్‌కు ఆతిథ్యం ముంబైకి బదులుగా బెంగళూరు, ఢిల్లీకి ఇవ్వబడింది.