Narendra Modi YouTube channel: రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ నరేంద్ర మోడీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ క్రమంలో గత రికార్డులను బద్దలు కొడుతూ.. నూతన రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన యూట్యూబ్ ఛానెల్‌గా నరేంద్ర మోడీ ఛానల్ నిలిచింది. ఇంతకీ ఏంతమంది వీక్షించారంటే..?
Narendra Modi: అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ కూడా ఓ రికార్డును బద్దలు కొట్టింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన యూట్యూబ్ ఛానెల్‌గా నరేంద్ర మోడీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను నరేంద్ర మోదీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ప్రధాని యూట్యూబ్ ఛానెల్.. లైవ్ స్ట్రీమ్ వీక్షణల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
చంద్రయాన్-3 రికార్డు కూడా
నరేంద్ర మోదీ ఛానెల్‌లో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక 'PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ అనే టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. నరేంద్రమోడీ ఛానెల్‌లోని ఈ లైవ్‌కి ఇప్పటివరకు మొత్తం 1 కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఈ ఛానల్ లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డు 2 వ స్థానానికి చేరింది. ఇక మూడవ స్థానంలో FIFA వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం ఉండగా.. నాలుగో స్థానంలో Apple లాంచ్ ఈవెంట్ ఉంది.
సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో కూడా నరేంద్ర మోదీ ఛానెల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. ప్రధాని మోడీ ఛానెల్‌లో మొత్తం 23,750 వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి. వీటి మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్‌లను పొందిన ప్రపంచంలోనే మొదటి నాయకుడుగా నరేంద్ర మోదీ నిలిచారు.
టాప్ 10 ప్రత్యక్ష ప్రసారాలు
నరేంద్ర మోడీ - రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ - 90 లక్షలు
ISRO- చంద్రయాన్ 3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ - 80 లక్షలు
CazéTV - ప్రపంచ కప్ 2022 బ్రెజిల్ vs క్రొయేషియా క్వాటర్ ఫైనల్ - 60 లక్షలు
CazéTV - బ్రెజిల్ vs దక్షిణ కొరియా 2022 ప్రపంచ కప్ 52 లక్షలు
CazéTV - వాస్కో vs ఫ్లెమెంగో 47 లక్షలు
SpaceX- క్రూ డెమో-2 40 లక్షలు
హిబ్ లేబుల్స్: bts నుండి వెన్న 37 లక్షలు
Apple- Apple ఈవెంట్ 36 లక్షలు
లా & క్రైమ్ నెట్‌వర్క్- డెప్ vs హియర్డ్ ట్రయల్ 35 లక్షలు
ఫ్లూమినెన్స్ ఫుట్‌బాల్ క్లబ్: రియో కప్ ఫైనల్ 35 లక్షలు