జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

By Nagaraju penumalaFirst Published Aug 6, 2019, 7:08 PM IST
Highlights

దీంతో స్పీకర్ ఓటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓటింగ్ లో జమ్ముకశ్మీర్ విభజన రద్దుకు అత్యధికంగా సభ్యులు మద్దతు పలికారు. దాంతో లోక్ సభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు అనుకూలంగా 366 మంది మద్దతు పలుకగా వ్యతిరేకంగా 66 మంది ఓటు వేశారు. అయితే ఒకరు సమావేశానికి గైర్హాజరయ్యారు.  

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ కు విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజన బిల్లును మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాలు పునర్విభజన బిల్లుపై ఓటింగ్ కు డిమాండ్ చేశారు. 

దీంతో స్పీకర్ ఓటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓటింగ్ లో జమ్ముకశ్మీర్ విభజన రద్దుకు అత్యధికంగా సభ్యులు మద్దతు పలికారు. దాంతో లోక్ సభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. 

లోక్ సభలో 433 మంది సభ్యులకు గానూ జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు అనుకూలంగా 366 మంది మద్దతు పలుకగా వ్యతిరేకంగా 66 మంది ఓటు వేశారు. అయితే ఒకరు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇకపోతే 22 మంది సభను వాకౌట్ చేశారు. 

ఇకపోతే సోమవారం రాజ్యసభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు పాస్ అయ్యింది. ముజువాణీ ఓటుతో రాజ్యసభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లుతోపాటు నాలుగు బిల్లులు పాస్ అయ్యాయి. తాజాగా లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. 

మెుత్తానికి కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకోగా లడఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకుంది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

click me!