నా భర్తతో వేగలేకపోతున్నా.. తరుచూ అది కావాలంటా! హెల్ప్‌లైన్‌లో గోడు వెల్లబోసుకున్న 87 ఏళ్ల వృద్ధురాలు

By Mahesh KFirst Published Sep 12, 2022, 10:54 PM IST
Highlights

గుజరాత్‌లో 89, 87 ఏళ్ల వయసున్న భర్త, భార్యలకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. 89 ఏళ్ల తన భర్త తరుచూ సెక్స్ కోసం వేధిస్తున్నాడని, నిరాకరిస్తే సీరియస్ అవుతున్నాడని ఆమె అభయమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి చెప్పింది. దీంతో వారు ఆయనకు కౌన్సెలింగ్ ఇస్తూ కోరికలను డైవర్ట్ చేసుకుంటూ యోగా చేయాలని సూచనలు చేశారు.
 

అహ్మదాబాద్: గుజరాత్‌లో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. జీవిత చరమాంకంలో ఉన్న దంపతుల నుంచి ఊహించని ఫిర్యాదు అందింది. పెళ్లి చేసుకుని, పిల్లలను కని, వారి పెళ్లిళ్లూ చేసిన ఆ జంట ఇప్పుడు కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నారు. తరుచూ సెక్స్ కావాలని తనను వేధిస్తున్నాడని 87 ఏళ్ల భార్య.. తన 89 ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లో మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అభయమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఆ వృద్ధ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది.

తరుచూ సెక్స్ కావాలని వేధిస్తున్నాడని, నిరాకరిస్తే తనపై సీరియస్ అవుతున్నాడని ఆ మహిళ 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అభయమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తన భర్త చెర నుంచి విముక్తి కావాలని కోరింది. 

ఉన్నత కుటుంబం నుంచి ఇలాంటి ఫిర్యాదు రావడంతో తొలుత అభయమ్ సిబ్బంది ఖంగారు పడ్డారు. 89 ఏళ్ల ఆ వృద్ధుడు ఇంజినీర్. వడోదరలోని సాయాజిగంజ్ నివాసి. ఆయన భార్య చెప్పిన బాధలు విని జోక్యం చేసుకోవడానికి వృద్ధుడు వారి ఇంటికి వెళ్లారు. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఆ మహిళను వేధించరాదని వారు సూచనలు చేశారు. కోరికలు తగ్గించుకోవడానికి ఈ వయసులో యోగా చేయడం మేలు అని తెలిపారు. గుళ్లు గోపురాలు తిరగాలని సూచించారు. అంతేకాదు, సీనియర్ సిటిజన్ల గార్డెన్లు, పార్క్‌లు పర్యటించాలని, తద్వార తన కోరికలను డైవర్ట్ చేసుకోవాలని వివరించారు.

click me!