నాలుగేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి నెల రోజుల్లోనే జీవిత ఖైదు

By narsimha lodeFirst Published Nov 12, 2021, 5:25 PM IST
Highlights


గుజరాత్ రాష్ట్రంలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నిషాద్ కు నెల రోజల్లోనే కోర్టు జీవిత ఖైదు విధించింది. ట్రయల్స్ నిర్వహించిన నాలుగు రోజుల్లోనే నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.
 


గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన  నిందితుడికి ఐదు రోజుల్లోనే కోర్టు శిక్షను ఖరారు చేసింది. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. అంతేకాదు రూ. 1 జరిమానాను కూడా విధించారు.  బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన నెల రోజుల్లోనే శిక్ష ఖరారైంది. ఐదు రోజుల్లోనే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రత్యేక న్యాయస్థానం గురువారం నాడు ఈ తీర్పును వెల్లడించింది.నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తర్‌ప్రదేశ్ కి చెందిన అజయ్ నిషాద్ కు life sentence విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి పీఎస్ కళా తీర్పును వెల్లడించారు.ఈ ఏడాది అక్టోబర్ 13న నిషాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు Nishadకు వివాహమైంది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న సచిన్ జీఐడీసీ ఏరియాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆమెపై Rapeకి పాల్పడ్డాడు. బాలిక కన్పించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో గాలించారు. అయినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. ఐదు గంటల పాటు బాలిక కోసం పోలీసులు, స్థానికులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.  రాంశ్వర్ కాలనీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్ వెనుక పొదల్లో బాలికను గుర్తించారు.అపస్మారక స్థితిలో బాలికను నిషాద్ వదిలి వెళ్లాడు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగారు.  బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక ప్రైవేట్ బాగాల్లో గాయాలైనట్టుగా వైద్యులు గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.

also read:ఢిల్లీ దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసు.. చిన్నారి దుస్తులపై వీర్యం ఆనవాళ్లు లేవు...

బాలికను ఎవరు తీసుకెళ్లారనే  విషయమై పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ఈ సీసీటీవీ పుటేజీ ని పరిశీలించి నిషాద్ ను Police అరెస్ట్ చేశారు.నిషాద్ ను అరెస్ట్ చేసిన 10 రోజుల్లోనే పోలీసులు Charge sheet దాఖలు చేశారు.
నిషాద్ ను అరెస్ట్ చేసిన పది రోజుల్లోనే ఛార్జీషీటు దాఖలు చేశారు. అభియోగాలు మోపిన అక్టోబర్ 25 నుండి ఐదు రోజుల్లోనే కోర్టు విచారణను ముగించింది. 60 మంది ప్రత్యక్ష సాక్షులను సూరత్ లోని ప్రత్యేక పోక్సో కోర్టు   ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఐదు రోజుల్లోనే నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.గుజరాత్ లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి.

చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేందుకు పలు రాష్ట్రాలు పలు కఠిన చట్టాలు చేస్తున్నాయి. అయితే కొన్ని రాస్ట్రాల్లో చట్టాల అమలను కఠినంగా అమలు చేస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు నిందితులకు అతి తక్కువ కాలంలోనే శిక్షలను ఖరారు చేస్తే కూడా  భవిష్యత్తులో నేరాలకు పాల్పడేవారు భయపడే అవకాశం ఉందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.ఈ కేసులో నెల రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువరించడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

click me!