బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్వచ్ఛంధ సంస్థది తప్పే: డ్రగ్ కంట్రోలర్ నివేదిక

By narsimha lodeFirst Published Jun 3, 2021, 5:10 PM IST
Highlights

కరోనా చికిత్సకు ఉపయోగించే పాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా కొనుగోలు చేయడం నిల్వ చేయడం తప్పేనని ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు.  ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకొంటామని ఆయన హైకోర్టుకు తెలిపారు. 

న్యూఢిల్లీ:కరోనా చికిత్సకు ఉపయోగించే పాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా కొనుగోలు చేయడం నిల్వ చేయడం తప్పేనని ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు.  ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకొంటామని ఆయన హైకోర్టుకు తెలిపారు. 

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్  తన స్వచ్ఛంధ సంస్థ ద్వారా పాబిఫ్లూ మందును ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహరం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది.  రాష్ట్రంలో మందుల కొరత ఉన్న సమయంలో ఈ మందులను ఆయన ఎలా కొనుగోలు చేశారని ప్రత్యర్ధులు ప్రశ్నించారు. 

ఈ విషయమై  ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్ ను న్యాయస్థానం విచారించింది. హైకోర్టు ఆదేశం మేరకు డ్రగ్ కంట్రోలర్ ఇవాళ కోర్టుకు నివేదికను సమర్పించారు. ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడ ఈ ఔషదాలను  అనధికారికంగా నిల్వ చేసినట్టుగా తేలిందని డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. గంభీర్ ఉద్దేశ్యం మంచిదే అయినా దాని వల్ల సమాజానికి నష్టమని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణ చేయాలని కోర్టు డ్రగ్ కంట్రోలర్ ను ఆదేశించింది. గంభీర్ సంస్థ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

click me!